మంచు మోహన్ బాబు జన్మదినం ఎప్పటి లాగే ఆయన విద్యా సంస్థల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొడుకు మంచు మనోజ్ చేసిన ప్రసంగం కాస్త ఆసక్తికరంగానే వుంది.
విభజించి పాలించడం, ఇగో, సెల్ఫిష్ నెస్, ఇదంతా నాది, ఇదంతా నేనే చేసాను అని అనుకోవడం సరి కాదని, చిట్టచివరిలో దేవుడి దగ్గరకు వెళ్లినపుడు సమాధానం చెప్పాల్సి వుంటుందన్నారు. కళ్లు వున్నాయని నోరు, నోరు వుందని కళ్లు పీకేసుకోము అని మనోజ్ అన్నారు. మనోజ్ స్పీచ్ మొత్తం ఈ చుట్టూనే తిరిగింది.
సీఈఓ కి ఎంత గౌరవం వుంటుందో గార్డినర్ కు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలన్నారు. తన తండ్రి ఏనాడూ అంతా తానే చేసాను, నేనే చేసాను అని ఏ రోజూ అనుకోలేదు అన్నారు. అసలు మనోజ్ ఎందుకు ఇలాంటి స్పీచ్ ఇలా ఇచ్చారు అన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
కొందరు యాంటీ జగన్ స్పీచ్ అనుకున్నారు. ఎందుకంటే ఓటుకు అమ్ముడు పోకండి, మంచి లీడర్ ను ఎంచుకోండి అని ఉపన్యాసం ముగించే ముందు మనోజ్ అనడంతో ఆ యాంగిల్ లో ఆలోచించారు.
అయితే మనోజ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం మంచు కుటుంబంలో అన్న దమ్ముల మధ్య వున్న అభిప్రాయ బేధాలే ఇందుకు లీడ్ తీసుకున్నాయని తెలుస్తోంది. ఇగో లు, అన్నీ తానే చేసా అని అనుకోవడం, అంతా తానే అని అనుకోవడం అనే మాటలు అన్న మంచు విష్ణును టార్గెట్ చేసే మనోజ్ అన్నారని తెలుస్తోంది. మనోజ్ సన్నిహిత వర్గాలు చాలా మంది మీడియా వారికి ఈ వీడియోను ప్రత్యేకంగా పంపడం విశేషం.
ఎందుకంటే కొన్ని యూ ట్యూబ్ చానెళ్లలో ఈ వీడియోను అప్ లోడ్ చేసారు. కానీ ఆ తరువాత ఎందుకో ఆ చానెళ్లలో వీడియో అనవైలబుల్ అంటూ కనిపించింది. మరి ఏం జరిగిందో ఆ చానెళ్లకే తెలియాలి. ఇదిలా వుంటే ఈ స్పీచ్ గురించి మరింత తెలుసుకోవడానికి మంచు మనోజ్ తో మాట్లాడాలని ట్రయ్ చేస్తే, ఆయన ఏదో సమావేశంలో బిజీగా వున్నారని తెలిసింది.