Advertisement

Advertisement


Home > Politics - Andhra

మరోసారి అజ్ఞానం చాటుకున్న అచ్చెన్న!

మరోసారి అజ్ఞానం చాటుకున్న అచ్చెన్న!

కొంత మంది నాయకులు అంతే. వారి అజ్ఞానమే అర్హతగా పెద్ద పదవుల్లోకి వెళ్లిపోతుంటారు. చంద్రబాబునాయుడు కోటరీలో మరీ సొంత జ్ఞానం, తెలివితేటలు ఉన్న వారికి పెద్దపదవులు ఎలా దక్కుతాయి? తెలివి ఉన్నవాళ్లే పెద్దపదవుల్లోకి వస్తే గనుక.. ఏదో ఒక నాడు తన సీటు గల్లంతు అవుతుందని చంద్రబాబు నిత్యం భయపడుతూనే ఉంటారు కదా! అలాంటి కారణాల చేతనే.. రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడుగా అతిపెద్ద పదవిని అచ్చెన్నాయుడు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన తన అజ్ఞానాన్ని చాలా ఘనంగా మరోసారి బయటపెట్టుకున్నారు.

విశాఖలో అతిపెద్ద డ్రగ్స్ దందా బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందువల్లనే ఇలా డ్రగ్స్ పట్టుబడ్డాయట. కోడ్ రాకపోతే గనుక.. రాష్ట్ర పోలీసు అధికారులు ఆ డ్రగ్స్ కంటైనర్ ను పోర్టు దాటించి.. వైసీపీ నాయకులకు మేలుచేసి ఉండేవారట. ఈ రహస్యాన్ని అచ్చెన్నాయుడే కనిపెట్టారు.

బ్రెజిల్ నుంచి వస్తున్న కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని అనుమానించిన ఇంటర్ పోల్ అధికారులు కొన్ని రోజుల ముందే సీబీఐకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. కంటైనర్ ఇక్కడకు చేరే సమయానికి సీబీఐ అధికారులు వచ్చి పరీక్షలు నిర్వహించి.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరి అచ్చెన్నాయుడు గారి జ్ఞానం ప్రకారం.. ఇంటర్ పోల్ కూడా ఇండియాలో ఎన్నికల కోడ్ కు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుందో ఏమో మనబోటి సామాన్యులకు తెలియదు.

ఎన్నికల సమయంలో ఎక్కడ ఏ చిన్న ఉపద్రవం జరిగినా.. దానిని తమ ప్రత్యర్థి పార్టీకి ముడిపెట్టి బురద చల్లడానికి పార్టీలు ప్రయత్నిస్తుండడం సహజం. ఇప్పుడు డ్రగ్స్ బయటపడిన నేపథ్యంలో కూడా అటు వైసీపీ, ఇటు తెదేపా కూటమి కూడా.. తమ ప్రత్యర్థులే అసలు నిందితులు అన్నట్టుగా మాటల బాణాలతో చెలరేగిపోతున్నాయి. ఇదంతా మామూలేలే అని పట్టించుకోకుండా వదిలేయవచ్చు.

కానీ అచ్చెన్నాయుడు చిత్రంగా.. ఎన్నికల కోడ్ రావడం వల్లనే.. డ్రగ్స్ దొరికాయని అనడం కామెడీగా కనిపిస్తోంది. ఇంటర్ పోల్ కారణంగానే.. డ్రగ్స్ సమాచారం బయటకు వచ్చిందనేది నిజం. కానీ అచ్చెన్న ఆ వ్యవస్థను ఎవరికి ముడిపెడతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?