ఇల్లు కంటె జైలు పదిలం కదా అచ్చెన్నా..?

చంద్రబాబు నాయుడు ప్రాణాలకు అపాయం ఉంది!- అవును మరి.. ఆయన పద్నాలుగేళ్ల పరిపాలన మీద ఎంత మంది కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలియదు గనుక నిజమే కావొచ్చు. పైగా, ఒకసారి ఆయన మీద నక్సలైట్లు క్లెమోర్…

చంద్రబాబు నాయుడు ప్రాణాలకు అపాయం ఉంది!- అవును మరి.. ఆయన పద్నాలుగేళ్ల పరిపాలన మీద ఎంత మంది కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలియదు గనుక నిజమే కావొచ్చు. పైగా, ఒకసారి ఆయన మీద నక్సలైట్లు క్లెమోర్ మైన్స్ తో దాడిచేసిన తర్వాత.. ఇప్పుడు నక్సలైటు కార్యకలాపాలు అనేవి రాష్ట్రంలో అంతర్ధానం అయిపోయినా సరే.. ఆ పేరు చెప్పుకుంటూ కలకాలం.. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని చెబుతూ ఉండొచ్చు. 

మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి అన్న సామెత చందంగా.. అప్పుడెప్పుడో దాడి జరిగింది.. కాబట్టి తనకు జీవితపర్యంతమూ ఎస్ఎస్‌జీ జడ్ కేటగిరీ భద్రత ఉండాల్సిందే అని ఆయన భావించవచ్చు. కానీ జైలుజీవితంలో కూడా ఈ చిన్నెలన్నీ ప్రదర్శించాలంటే ఎలా కుదురుతుంది?

సాధారణంగా సినిమాల్లో రాజకీయ నాయకులు బయట సొసైటీలో ఉంటే ప్రాణాపాయం ఉన్నదని, పోలీసులతో పైరవీలు చేసుకుని మరీ.. వెళ్లి జైల్లో గడుపుతూ ఉంటారు. అక్కడైతే ప్రాణాలకు రక్షణ ఉంటుందని. కానుక‌. చంద్రబాబు మాత్రం ఎంత వెరైటీ అంటే.. జైల్లో ప్రాణాలకు భద్రత లేదని, ఇంట్లో గడుపుతానని అంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వంటి జైలులో ఉండే పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను ఛేదించుకుని ఏదైనా ప్రయత్నం చేయగలిగేవారు.. ఇంట్లో చేయలేరా? అనేది కొందరి సందేహం.

అచ్చెన్న చెబుతున్నట్టుగా.. ప్రాణాపాయం ఒక్కటే హౌస్ అరెస్టు కోసం వారు చెప్పగల కారణం అయితే.. దానికి బదులుగా.. జైల్లోనే తమ నాయకుడికి భద్రత లేయర్స్ పెంచాలని కోరవచ్చు. అంతే తప్ప.. ఇంట్లో ఉంటాం అని కోరడంలో అర్థం లేదు.

జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేసేస్తున్నారని ఇన్నాళ్లూ గోలపెట్టిన వారంతా.. ఇప్పుడు వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోతోంటే.. వాటిమీద పడి ఏడవడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారు చెప్పగల సాకు ఇదొక్కటే అయితే గనుక.. ఇల్లు కంటె జైలు పదిలం అని వారు తెలుసుకోవాలి. 

జైల్లో చంద్రబాబునాయుడుకు కాలికి దెబ్బతగిలినా, జలుబు చేసినా కూడా జగన్ మీద నిందలు వేయొచ్చు. అదే ఇంటికి వెళ్తే అంత సీన్ ఉండదు. ఇలాంటి అబద్ధపు నిందలకు ఆస్కారం ఉండదు. తెలుసుకోవాలి.