
ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్‌పై ట్విట్టర్ వేదికగా మరోసారి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని.. మీసం తిప్పితే ఊరుకోడానికి.. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ!.. నాది తెలుగు గడ్డ! అంటూ వార్నింగ్ ఇచ్చారు.
బాలకృష్ణ భయపెడితే తాను భయపడే రకం కాదని ఇందులోను మరీ స్పెషల్ గా తాను కాపు బిడ్డనంటూ చెప్పుకుంటూ వార్నింగ్ ఇవ్వడం విశేషం. కాగా ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ మీసాలు తిప్పుతూ అంబటి రాంబాబుకు వార్నింగ్ ఇవ్వడంతో అంబటి కూడా అదే రీతిలో బుద్ధి చెప్పారు. సినిమాల్లో మీసాలు తిప్పుకోవాలని.. దమ్ముంటే రా అంటూ ఛాలెంజ్ విసిరారు. దీంతో సభలో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మరోవైపు సస్పెషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలయ్య.. అంబటి రాంబాబునే రెచ్చగొట్టారని.. ఎవరికి భయపడే రకం కాదని.. మా బ్లడ్ వేరు.. మేము వేరు అన్నట్లు మాట్లాడారు. కాగా బాలయ్య వెకిలి చేష్టలు మానుకొవాలని హితవు చెబుతూ.. మొదటి తప్పిదంగా భావిస్తూ క్షమించి వదిలేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా