Advertisement

Advertisement


Home > Politics - Andhra

గంటా కోర్టులోనే బంతి?

గంటా కోర్టులోనే బంతి?

టీడీపీ అధినేత విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఝలక్ ఇచ్చేశారు. వరసగా రిలీజ్ చేసిన మూడవ జాబితాలోనూ గంటా పేరు లేదు. ఆయన కోరుకున్న భీమిలీ సీటు ఇవ్వలేదు. భీమిలీ సీటుని విశాఖ ఎంపీతో ముడిపెట్టారని బీజేపీకి విశాఖ ఎంపీ సీటు ఇస్తే బాలయ్య చిన్నల్లుడు భరత్ కి భీమిలీ సీటు ఇవ్వడానికే ఉంచారని ప్రచారం జరిగింది. ఇపుడు శ్రీ భరత్ కి విశాఖ ఎంపీ ఇచ్చారు. దాంతో భీమిలీ అసెంబ్లీ సీటు ఖాళీగానే ఉంది. కానీ ఆ సీటుని మాత్రం గంటాకు ఇవ్వడంలేదు.

అది అలా రిజర్వ్ లోనే పెట్టారు. గంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ జిల్లాలో రాజకీయం చేయనీయకుండా చేసేందుకే ఇదంతా అని అంటున్నారు. ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయమనే హై కమాండ్ చెబుతూ వస్తోంది. ఆయన నిర్ణయం కోసమే ఎదురుచూస్తూ చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ ని ప్రకటించకుండా వాయిదా వేశారు.

ఒకవేళ గంటా అక్కడ నుంచి కూడా పోటీకి నో చెబితే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాదిరిగా గంటాకు ఈసారి పోటీ చేసే చాన్స్ లేనట్లే అని అంటున్నారు. అపుడు చీపురుపల్లిలో మాజీ మంత్రి కిమిడి మృణాళినికి టికెట్ ఖరారు చేస్తారు అని అంటున్నారు.

గంటా ఏమి డిసైడ్ చేస్తారో చూడాలని అంటున్నారు. గంటా విశాఖకు 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి చీపురుపల్లిలో కొత్తగా రాజకీయం మొదలెట్టాలన్న మాట. టీడీపీ హై కమాండ్ గంటా విషయంలో అనుసరిస్తున్న వైఖరితో ఆయన వర్గంలో కొంత అసహనం వ్యక్తం అవుతోంది. భీమిలీ టికెట్ ఇస్తే గంటా గెలిచి వస్తారని వారు అంటున్నారు. చంద్రబాబు మాత్రం గంటాకు విశాఖ జిల్లాలో ఎక్కడా సీటు ఇవ్వకపోవడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?