Advertisement

Advertisement


Home > Politics - Andhra

నోరు పారేసుకున్న బండారుకి అరదండాలు ?

నోరు పారేసుకున్న బండారుకి అరదండాలు  ?

మంత్రిగా ఉన్న ఆర్కే రోజా మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నోరు పారేసుకున్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. బండారు మూడు రోజుల క్రితం విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి రోజా మీద దారుణంగా మాట్లాడారు.

ఆమె మీద మీడియాలో రాయలేని పదజాలంతో దూషించారు. నిస్సిగ్గుగా మాట్లాడి ఒక మహిళా మంత్రిని అవమానపరచడమే కాదు సీఎం జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండారు అలా మాట్లాడినా వైసీపీ నుంచి ఒక్క మహిళా నేత కూడా ఖండించకపోవడం ఇక్కడ విశేషం.

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ దీని మీద రియాక్ట్ అయ్యారు. ఆయన జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి ఈ విషయం తెస్తూ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే ఏపీ మహిళా కమిషన్ కి ఆయన ట్విట్టర్ ద్వారా దీని మీద ప్రశ్నించారు.  మంత్రి హోదాలో ఉన్న మహిళకే ఈ పరిస్థితి ఉంటే ఇంక మామూలు స్త్రీల పరిస్థితి ఏంటి మీ కమిటీ ఏం చేస్తున్నట్టు అని నిలదీశారు.

దీంతో ఏపీ మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అయింది. బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేయాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరినట్లుగా తెలుస్తోంది. తొందరలోనే బండారు కి అరదండాలు పడతాయని అంటున్నారు. అయితే ఇది కూడా తమ తప్పు లేదని కక్ష సాధింపు చర్యలు అంటూ సమర్ధించుకునే తమ్ముళ్ళు ఉన్న పార్టీలో ఏమి జరుగుతుందో మరి.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా