Advertisement

Advertisement


Home > Politics - Andhra

భీమిలీలో జేగంట మోగేనా?

భీమిలీలో జేగంట మోగేనా?

భీమిలీని ఏరి కోరి తీసుకున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు అంతా సానుకూలంగానే ఉందా అంటే టైట్ ఫైట్ తప్పదని అంటున్నారు. వైసీపీ అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు జనంలో మంచి పేరుంది. ఆయన అందరికీ అందుబాటులో ఉంటారు అని ప్రతీ ఒక్కరూ చెబుతారు.

అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అవంతి నియోజకవర్గం అంతటా బాగా తిరిగారు. కరోనా సమయంలో ఆయన ప్రజల చెంతనే ఉంటూ వారికి అండగా నిలిచారు. ఇపుడు ఎన్నికల వేళ ఇవన్నీ అవంతికి పాజిటివ్ వేవ్ ని క్రియేట్ చేస్తున్నాయని అంటున్నారు.

అవంతి కూడా అదే మాట చెబుతున్నారు. తన లాగ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా లేక గెలిచాక అయిదేళ్లూ కనిపించని గంటా లాంటి వారు కావాల అని ప్రశ్నిస్తున్నారు. తాను విజయం సాధిస్తే ప్రజల మధ్యనే ఉంటాను అని ఆయన అంటున్నారు. వారి కోసం నిరంతరం పనిచేస్తాను అని అంటున్నారు.

గ్రామాలలో చూస్తే వైసీపీకి గ్రాఫ్ బాగా పెరిగింది. ప్రతీ ఇంటికీ వైసీపీ సంక్షేమ పధకం చేరింది. ఇక మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలీలో ఎస్సీలు బీసీలు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఆ ఓట్లలో అధిక మొత్తం వైసీపీకి పడతాయని అంచనా వేసుకుంటున్నారు. అయితే నాయకులను తమ వైపు తిప్పుకోవడంతో టీడీపీ ముందుంది అంటున్నారు.

అలా వైసీపీని టార్గెట్ చేస్తోంది. అదే తమకు పెరిగిన బలం అని చెప్పుకుంటోంది. కానీ ఓట్లు వేసేది ప్రజలు అని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలోలా ప్రజలు ఎవరో చెబితే వేసే పరిస్థితి లేరని అంటున్నారు. మహిళా ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో భీమిలిలో  ఉన్నారు. వీరి ఓట్లు తమకు పూర్తిగా పడతాయని వైసీపీ ధీమాగా ఉంది.

ఈ పరిణామాల నేపధ్యంలో భీమిలీలో జేగంట మోగుతుందా అన్నాది చర్చనీయాంశంగా ఉంది. గతంలో మంత్రిగా గంటా పనిచేసినపుడు ఆయన పనితీరుని వైసీపీ జనం ముందు పెడుతోంది. ఆయనకు ఓటు వేస్తే ఆయన మనుషులనే పెట్టి తాను మాత్రం కనిపించరు అని అంటోంది. విశాఖ ఉత్తరం నుంచి గంటా భీమిలీకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరానికి అయిదేళ్ళ పాటు ముఖం చూపించని ఆయన భీమిలీకి ఏమి చేస్తారని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. వీటికి గంటా జవాబు చెప్పుకోవడం కష్టమే అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?