Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబు అరెస్ట్ మీద బీజేపీ రియాక్షన్ ఉంటుందట...!

బాబు అరెస్ట్ మీద  బీజేపీ రియాక్షన్ ఉంటుందట...!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా వారం రోజులుగా ఉంటున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో బాబు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈసారి వినాయకచవితి పండుగ కూడా బాబుకు జైలులోనే అని టీడీపీ తమ్ముళ్ళు తెగ ఫీల్ అవుతున్నారు.

బాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. టీడీపీ  నేతలు కొందరు మాత్రం కేంద్రంలోని బీజేపీ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారు అయితే ఈ విషయంలో బాహాటంగానే బీజేపీని నిలదీశారు.

ఆంధ్రాలో బాబు అరెస్ట్ అయితే కేంద్రం నుంచి స్పందన లేకపోవడాన్ని అయ్యన్న డెలిబ్రేట్ గానే తప్పుపట్టారు. బీజేపీకి ఈ విషయంలో సంబంధం లేదని పురంధేశ్వరి లాంటి వారు చెబుతున్నా టీడీపీ వారు మాత్రం  కేంద్ర బీజేపీ మీద లోలోపల కుతకుతలాడిపోతున్నారు.

ఆదివారం విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి దేవ సింహ చౌహాన్ ఏపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద మాట్లాడారు. ప్రత్యేకించి చంద్రబాబు అరెస్ట్ మీద ఆయన స్పందించారు. సరైన సమయంల్లో మా కేంద్ర అధినాయకత్వం ఈ అంశం మీద స్పందిస్తుందని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది.

బాబు అరెస్ట్ నిన్నా మొన్నా కాలేదు, పది రోజులకు దగ్గర పడుతోంది. రిమాండ్ లో కూడా వారం పైగా ఉన్నారు. అయినా కానీ బీజేపీ పెద్దలకు సరైన సమయం సందర్భం రాలేదా అని కేంద్ర మంత్రి కామెంట్స్ మీద తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. ఆ సమయం వచ్చేసరికి బాబు బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తారు అని వారు అంటున్నారు. కేంద్ర బీజేపీకి సరైన సమయం అంటే ఎన్నికలు దగ్గరపడినాకేనా అని అంటున్న వారూ ఉన్నారు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా