Advertisement

Advertisement


Home > Politics - Andhra

బీజేపీకి వల్లమాలిన ప్రేమట‌....భారతరత్నఇస్తారా...?

బీజేపీకి వల్లమాలిన ప్రేమట‌....భారతరత్నఇస్తారా...?

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ పేరు మీద ఉన్న హెల్త్ వర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం మీద టీడీపీ తో పాటుగా బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ఆయన సొంత కుమార్తె, బీజేపీ నాయకురాలు అయిన దగ్గుబాటి పురందేశ్వరి అయితే ఈ విషయంలో ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీయార్ మీద బీజేపీకి అపార గౌరవాభిమానాలు ఉన్నాయని ఆమె చెప్పుకున్నారు. ఆయన పేరును తిరిగి హెల్త్ వర్సిటీకి పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. తాను పార్లమెంట్ లో ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం పోరాటం చేశానని ఆమె చెప్పుకున్నారు.

అంతవరకూ బాగానే ఉన్నా ఎన్టీయార్ కి భారతరత్నకు ఎందుకు ఇప్పించలేకపొయారు అన్న అభిమానుల ప్రశ్నలకు ఆమె ఏం సమాధానం చెబుతారో. కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ సర్కార్ లో పనిచేసిన పురందేశ్వరి విగ్రహం ఏర్పాటు వరకూ చేసిన కృషి బాగానే ఉన్నా భారతరత్న కోసం కదా ఇంకా ఎక్కువగా పోరాడాల్సింది అన్న వారూ ఉన్నారు.

నాడు కాకపోయినా నేడు బీజేపీ ప్రభుత్వంలో అయినా భారతరత్న అన్నగారికి  ఇప్పించగలరా అన్న ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె చెబుతున్నట్లుగా బీజేపీకి ఎన్టీయార్ మీద విపరీతమైన అభిమానం గౌరవం ఉన్నాయి కాబట్టి.  ఎన్టీయార్ కి భారతరత్న వస్తే అంతకంటే పెద్ద గౌరవం వేరేగా ఉంటుందా.  ఆయన కుమార్తె ఆ దిశగా ఆలోచిస్తే మంచిదేమో కదా. తమ చేతులలో ఉన్న దాన్ని వదిలేసి ఇతరులు ఎన్టీయార్ మీద ప్రేమాభిమానాలు చూపాలని కోరడాన్ని కాస్తా ఆలోచించుకోవాలేమో.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా