Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబు నేరం చేశారంటున్న జనసేన నేత

బాబు నేరం చేశారంటున్న జనసేన నేత

చంద్రబాబుని అక్రమ అరెస్ట్ అని ఒక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయనని అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం మీద ఆయన వీర లెవెల్ లో మండిపడుతున్నారు. జనసేనలో అందరి అభిప్రాయాలు ఇలాగే ఉన్నాయా అంటే కొందరు మాత్రం సమ దృష్టితో ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మీద ఎనిమిది కేసులు ఉన్నాయని, బాబు మీద ఒక నేరం మోపబడిందని తేడా చూపుతూనే బాబు సైతం కేసులలో ఉన్నారని చెప్పేశారు విశాఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ.

ఆయన వైసీపీ మంత్రి ఆర్కే రోజా విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో జగన్ చంద్రబాబు ఇద్దరూ కేసులలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం చంద్రబాబునే రోజా టార్గెట్ చేస్తే జగన్ సంగతేంటని బొలిశెట్టి ప్రశ్నిస్తూనే ఈ క్రమంలో చంద్రబాబు మీద కేసు ఉందన్న మాటను అంగీకరించారు.

జనసేనలో బొలిశెట్టి వంటి వారు రెండు ప్రధాన పార్టీల మీద గతంలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇపుడు మారిన రాజకీయాలలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. దాంతో గతంలో మాదిరిగా విమర్శలు చేయలేకపోవచ్చు కానీ అవినీతిలో బాబు జగన్ ఇద్దరూ ఒక్కటే అని రోజాని విమర్శించే క్రమంలో జనసేన నేత కౌంటర్ వేయడం విశేషం.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా