Advertisement

Advertisement


Home > Politics - Andhra

చంద్రబాబుకి మింగుడుపడని డిమాండ్!

చంద్రబాబుకి మింగుడుపడని డిమాండ్!

టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడుపడని డిమాండ్ ని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ పెట్టారు. ఈ నెల 14న విశాఖ వస్తున్న చంద్రబాబు గాజువాకలో ప్రజాగళం సభలో పాల్గొంటున్నారు. అయితే ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని బొత్స డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం ఎప్పటికీ చేయమని బీజేపీ పెద్దలతో చెప్పించాలని ఆయన అంటున్నారు.

వైసీపీ అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని అదే మాట టీడీపీ చెప్పగలదా అని ప్రశ్నించారు. మొక్కుబడిగా తూతూమంత్రంగా చెప్పడం కాదు కచ్చితమైన హామీని పొత్తు పార్టీగా ఉన్న బీజేపీ నుంచి ఇప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కష్టాలకు శాస్వత ముగింపు పలకాలని బాబుని బొత్స కోరారు

తమ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని కేంద్రానికి లేఖ రాసింది అని ఆయన గుర్తు చేసారు. జగన్ నేరుగా ప్రధానికి లేఖ రాసి తమ పార్టీ వైఖరి ఏంటో చెప్పారని ఆయన అన్నారు. గాజువాక ఎన్నికల ప్రచారానికి వస్తున్న చంద్రబాబు ఇదే తీరున స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ఏజ్ ప్రభావం ఆయన రాజకీయ నిర్ణయాలలో కనిపిస్తోందని బొత్స సెటైర్లు వేశారు. అనకాపల్లిలో కూటమి తరఫున ఎంపీ అభ్యర్ధిగా క్యాష్ పార్టీని దించారని అని సీఎం రమేష్ మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. స్థానికంగా బీసీ నేత ఎవరూ బాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. బీసీలు అంటే బాబుకు మొదటి నుంచి చిన్నచూపే అందుకే వారికి ఎక్కువ సీట్లు ఇవ్వలేకపోయారు అని బొత్స విమర్శించారు. మాట మీద నిలబడని నేతలుగా చంద్రబాబు పవన్ ఉన్నారని అన్నారు. సామాజిక న్యాయం ఏంటో వైసీపీ అధినేత జగన్ ఆచరణలో చూపించారు అని ఆయన అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?