Advertisement

Advertisement


Home > Politics - Andhra

బ్రాహ్మణి Vs రోజా.. ఇచ్చిపడేసింది

బ్రాహ్మణి Vs రోజా.. ఇచ్చిపడేసింది

తన మామ చంద్రబాబుకు మద్దతుగా బ్రాహ్మణి మాట్లాడిన విషయం తెలిసిందే. చంద్రబాబును అరెస్ట్ కోసం రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ఏం లేదని, 8ఏళ్ల తన కొడుకు దేవాన్ష్ కు ఆ కాపీ చూపించినా ఏం లేదని చెబుతాడంటూ బ్రాహ్మణి ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

బ్రాహ్మణి వ్యాఖ్యలపై వైసీపీ నేత, మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అవినీతి గురించి రాష్ట్రంలో ఎవ్వర్ని అడిగినా చెబుతారని, పిల్లాడైన దేవాన్ష్ కు ఆ విషయాలు తెలియకపోవచ్చని అన్నారు.

"ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు నీ మామ. నీ మొగుడు లోకేష్ కు అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడు తప్ప, యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదనే విషయం తెలుసుకో. గతంలో మీ మామ ఇచ్చిన మేనిఫెస్టో చూడు. అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశాడు నీ మామ. అలాంటి వ్యక్తి సంక్షేమం చేశాడు, అభివృద్ధి చేశాడు, అరెస్ట్ చేస్తారా అంటూ బ్రహ్మణి చిలకపలుకులు పలుకుతోంది."

ఇలాంటి చిలకపలుకులుకు సింపతీ రాదన్నారు రోజా. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, ఒకవేళ అరెస్ట్ చేసినా జగన్ కు వచ్చిన లాభం ఏమీ లేదనే విషయాన్ని బ్రాహ్మణితో పాటు, టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు.

స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అవుతామనే విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన అరెస్ట్ కు 2 రోజుల ముందు నుంచే ఆ విషయాన్ని చెప్పుకొని సింపతీ కొట్టే ప్రయత్నం చేశారు. నిజంగా తప్పించుకునే అవకాశం ఉంటే, ఎప్పట్లానే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని చంద్రబాబు తప్పించుకొని ఉండేవారని, ఈసారి బాబుకు ఆ అవకాశం లేదని అన్నారు రోజా.

 


  • Advertisement
    
  • Advertisement