మెగాస్టార్.. అనుష్క.. ఆల్ మోస్ట్ ఫిక్స్

యువి సంస్థ అంటే హీరోయిన్ అనుష్కకు పుట్టిల్లు లాంటింది. చాలా కాలం తరువాత మిస్ శెట్టితో హిట్ కొట్టింది. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో సినిమా చేయబోతోంది.  Advertisement మెగాస్టార్ తో గతంలో…

యువి సంస్థ అంటే హీరోయిన్ అనుష్కకు పుట్టిల్లు లాంటింది. చాలా కాలం తరువాత మిస్ శెట్టితో హిట్ కొట్టింది. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో సినిమా చేయబోతోంది. 

మెగాస్టార్ తో గతంలో స్పెషల్ సాంగ్ చేసినా హీరోయిన్ గా చేయలేదు. ఇప్పుడు ఆ వెలితి తీరబోతోంది. బింబిసార ఫేమ్ మల్లిడి వేణు (వశిష్ట) డైరక్షన్ లో యువి అనుబంధ సంస్థ నిర్మించే మెగాస్టార్ సినిమాకు అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు డిస్కషన్లు జరుగుతున్నాయి.

రీసెంట్ గా మిస్ శెట్టి సినిమాలో అనుష్క లుక్స్ చూసిన మెగాస్టార్ కూడా ఈ ప్రపోజల్ కు ఊ అన్నట్లు తెలుస్తోంది. అనుష్క గత కొంతకాలం సన్నబడే పనిలో వున్నారు. సైజ్ జీరో సినిమా పుణ్యమా అని ఆమె ఆరోగ్యం, శరీరాకృతి రెండూ దెబ్బతిన్నాయి. అందుకోసం నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంది. పూర్తిగా ఫిజిక్ ఫిట్ అయ్యే పనిలో పడ్డారు. వన్స్ అది సెట్ అయ్యాక, ఈ కాంబినేషన్ అనౌన్స్ అయ్యే అవకాశం వుంది.

వాస్తవానికి ముందుగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తన కుమార్తె నిర్మాతగా ఓ సినిమా చేసి, దాని తరువాత యువి-వశిష్ట సినిమాన చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ముందుగా యువి-వశిష్ట సినిమాను చేయబోతున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా వుంటుందని తెలుస్తోంది.