Advertisement

Advertisement


Home > Politics - Analysis

పవన్ ఇంకా ఎక్కువ మాట్లాడాలి

పవన్ ఇంకా ఎక్కువ మాట్లాడాలి

నువ్వు చదివేసిన, చదివిన పుస్తకాల పేర్లు చెప్పు.. నువ్వేంటో చెబుతా అన్నాడట వెనకటికి ఎవరో. మన మాట, మన భాష, మన సంస్కారం ఇవన్నీ కలిపి మన మీద జనాలకు ఓ అవగాహన కల్పిస్తాయి. చేతిలో ఓ మంచి పుస్తకం పట్టుకుంటారు పవన్ కళ్యాణ్. కానీ నోరు తెరిస్తే మురికి కంపు. 

జగన్ అంటే ఎంతయినా కోపం వుండొచ్చు. ఈర్ష్యా అసూయలు వుండొచ్చు. కానీ మాట్లాడేందుకు ఓ పద్దతి వుంటుంది. జగన్ ఏమీ పవన్ ను తిట్టలేదు. దత్తపుత్రుడు అని వుండొచ్చు. మిగిలిన మంత్రుల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు.

గత ఎన్నికల ముందు లోకేష్ గురించి, బాబుగారి పార్టీ గురించి పవన్ మాట్లాడిన మాటలు జనం మరిచిపోలేదు. ఈ డిజిటల్ యుగంలో అన్నీ రికార్డ్ నే. పదిలంగా వున్నాయి. అలాంటి లోకేష్ ను కౌగలించుకుంటూ, జగన్ ను మాత్రం ‘నువ్వెంత.. నీ బతుకెంత’ అని పవన్ అనడం అంటే ఏమనుకోవాలి. 

జనం ఈ మాటలు విని ఛీ అని ఊస్తున్నారు. ఈ సంగతి పవన్ కు తెలియకపోవచచ్చు. ఆయన దృష్టికి రాకపోచవ్చు. కానీ దాని ఇంపాక్ట్ వుండకుండా పోదు.

జనాలు ఏమంటున్నారు. పవన్ ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచింది. అతని సంస్కారం బయటపడుతుంది అంటున్నారు. న్యూట్రల్ గా వుండేవారు ఈ మాటలు విని ఇటు మొగ్గే బదులు అటు మొగ్గే ప్రమాదం వుందని తెలుగుదేశం జనాలే భయపడుతున్నారు.

పవన్ కు వున్న సమస్య ఏమిటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఎటో వెళ్లి పోతారు. ఏదేదో మాట్లాడతారు. ఊగిపోతారు. అరుస్తారు..ఏదేదో చేస్తారు. ఇదంతా జనం ఓ ఎంటర్ టైన్ మెంట్ గా చూస్తారు. 

కానీ పదే పదే జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని, తానేం చేయగలను, తాను ఎలా చేయగలను అన్నది చెప్పకపోతే, కేవలం దేశం పల్లకీ మోయడం కోసం, ఆ పార్టీకి అధికారం సంపాదించి పెట్టడం కోసమే పని చేస్తున్నారన్న క్లారిటీ జనానికి వస్తుంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా