
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో పచ్చవర్గాలు ఎవరి డప్పు వాళ్లు గట్టిగానే కొడుతున్నారు. వీకెండ్ లో అయితే చాలా మంది బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అని ఎవరి స్థాయిలో వారు చట్టాలను వివరించి చెప్పారు!
చంద్రబాబు అరెస్టుపై ఎన్ఆర్ఐలు, హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ బ్రహ్మీలు తమదైన కామెడీని పండించారు! చంద్రబాబు అరెస్టుపై బళ్లారిలో కూడా నిరసనలు ప్రదర్శనలు జరిగాయట! మరి అక్కడ కూడా కమ్మోళ్లు గట్టిగానే ఉన్నారుగా! జరగవా మరి!
ఈ నిరసనలు, ప్రదర్శనలు సెలెక్టివ్ చోట్లలోనే జరగుతాయి. హైదరాబాద్ కూకట్ పల్లి, మధురానగర్ లలో వీకెండ్ లో ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుని చంద్రబాబు అరెస్టుపై కమ్మ సంఘాలు తమ బ్యానర్లను కాసేపు పక్కన పెట్టి నిరసన తెలిపాయి.
ఇలా చంద్రబాబును కమ్మ సంఘం నేత తరహాలో తయారు చేశారు ఆఖరికి! ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్రలో భాగమైన కళ్యాణదుర్గం- కర్ణాటకలో భాగమైన చిత్రదుర్గ ప్రాంతంలో కమ్మ వాళ్ల జనాభా ఉంటుంది. ఈ ప్రభావం బళ్లారి వరకూ కాస్త కొనసాగుతుంది. బళ్లారి ప్రాంతానికి కూడా కమ్మవాళ్లు చాలా యేళ్ల కిందటే పెద్ద ఎత్తున వలస వెళ్లారు.
రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలను చేయించిన మాలపాటి వెంకటేశ్వరరావు, పరిటాల రవి గురువు ఈయన. ఇతడిది కూడా ఆ బళ్లారి ప్రాంతమే. ఇతడిని బళ్లారిలోనే కాల్చి చంపారు. అలాంటి బళ్లారిలో కన్నడలో బోర్డులు రాసి చంద్రబాబు కు సంఘీభావం తెలిపారు కమ్మ వాళ్లు!
అలాగే కర్ణాటకలో భాగమైన పావగడ ప్రాంతంలో ఇప్పటికీ ఈనాడు పేపర్ ను మాత్రమే చదువుతామనే హార్డ్ కోర్ కమ్మవాళ్లున్నారు! ఈ బ్యాచ్ తెగ ఇదైపోతుందిప్పుడు! ఏపీ అయినా, తెలంగాణ అయినా, ఎన్ఆర్ఐల్లో అయినా... కమ్మ వాళ్ల ఆందోళనే తెలుగు వాళ్ల ఆందోళనగా మారింది. వీరికి తోడు అక్కడక్కడ సాఫ్ట్ వేర్ బ్రహ్మీలు, చంద్రబాబు వల్లనే తమకు ఐటీ ఉద్యోగం వచ్చిందనే భ్రమ పడే అమాయకులు బాగా బాధపడుతున్నారు పాపం!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా