మోడీని అరెస్ట్ అన్నారు.. అదే మోడీ వున్నపుడే

విధి బలీయమైనది.. విధి చిత్రమైనది. రకరకాల విన్యాసాలు చేస్తుంటుంది. Advertisement హైదరాబాద్‌లో అడుగుపెడితే మోడీని అరెస్ట్ చేస్తా.. దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా మాట్లాడారు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు. కానీ గమ్మత్తేమిటంటే అదే…

విధి బలీయమైనది.. విధి చిత్రమైనది. రకరకాల విన్యాసాలు చేస్తుంటుంది.

హైదరాబాద్‌లో అడుగుపెడితే మోడీని అరెస్ట్ చేస్తా.. దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా మాట్లాడారు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు.

కానీ గమ్మత్తేమిటంటే అదే మోడీ ప్రధానమంత్రిగా వుండగా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ తుపాకీ జగన్ భుజాల మీద వుందనుకోవాలో లేక, తుపాకీ లోడ్ చేయడానికి మోడీ అనుమతివ్వడమో, మద్దతివ్వడమో చేసారనుకోవాలో?

ఆంధ్రలో భాజపాకు వచ్చేది..పోయేది ఏమీ లేదు. ఏ పార్టీ జనాలు ఎంపీలుగా గెలిచినా జైమోడీ అనాల్సిందే. కాంగ్రెస్ కు ఆంధ్రలో వున్న ఆశ అంతో ఇంతో చంద్రబాబే. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ అండ్ కో కాస్త మంచి ఫలితాలు సాధిస్తే ముందుగా చేతులు కలిపే అవకాశం వుంది బాబుగారికే. పత్రికలు ఏం రాస్తాయి అన్నది కేవలం ప్రజల వరకే. ఏ పార్టీ… ఏ నాయకుడు.. ఎలా వుంటారు.. ఎలా ప్రవర్తిస్తారు అన్నది నాయకులకు బాగా తెలుసు. అందులోనూ మోడీకి ఇంకా బాగా తెలుసు. అందుకే ఆంధ్రలో రాజకీయాలను అలా చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది.

మోడీ అలా చూసీ చూడనట్లు వదిలేస్తున్నా కూడా చంద్రబాబు అరెస్ట్ అంటున్న పవన్ జై మోడీ అనే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇదంతా మోడీ వల్లే జరుగుతోంది అని అనడం లేదు. మోడీ దృష్టికి తీసుకెళ్తాం అనే అంటోంది. జగన్ అయితే కేంద్ర సంస్థలే స్కిల్ స్కామ్ ను మొదట కనిపెట్టాయి అంటున్నారు. 

ఇలాంటి పరిస్థితి వుంది కనుకే మోడీని తెలుగుదేశం పార్టీ వైపు దృష్టి సారించేలా చేయాలని ఆంధ్రలో యాంటీ జగన్ ఉద్యమాన్ని బలంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. అలా అయితే మోడీ మనసు మార్చుకుని చంద్రబాబు వైపు వస్తారని ఓ ఐడియా.

కానీ మోడీ గతం మరచిపోలేదు. భవిష్యత్ లో చంద్రబాబు తనే ఫస్ట్ ఆప్షన్ అనీ తెలుసు. అందుకే ప్రస్తుతానికి ఆయన మౌనంగా వుండి, గతంలో బాబు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ, తన పని తాను చేసుకుంటూ వెళ్లి పోతున్నారేమో?