Advertisement

Advertisement


Home > Politics - Andhra

మా ఎంపీ లోకల్... సీఎం కి సరైన కౌంటర్!

మా ఎంపీ లోకల్... సీఎం కి సరైన కౌంటర్!

అనకాపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ నుంచి అభ్యర్ధులను పరిచయం చేశారు. ఒక్కొక్కరి గురించి ఆయన చెబుతూ వారితో మంచి చేయిస్తామని, మంచి పాలన అందిస్తామని చెప్పారు. అనకాపల్లి సభలో చంద్రబాబు మీదనే విమర్శల దాడి చేసిన జగన్ టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ మీద ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఆ మాటకు వస్తే లోకల్ గా ఉన్న అభ్యర్థుల మీద ఏ చిన్న విమర్శ చేయలేదు.

అదే చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో ప్రతీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మీద ఘాటు విమర్శలు చేసారు. పారా చూట్ నేతలు అన్నారు. ఢిల్లీ తెలియని వారు ఎంపీ అభ్యర్ధి అన్నారు ఇలా బాబు విమర్శల జల్లు కురిపించారు.  జగన్ మాత్రం ఒక్కటే మాట అన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా బీసీ నేతకు అవకాశం ఇచ్చాం, బూడి ముత్యాలనాయుడు మీ వాడు మీ నుంచి వచ్చిన వారు. పక్కా లోకల్ మన అభ్యర్ధి అని ఆయన పరిచయం చేశారు. డిప్యూటీ సీఎం గా మంచి పాలన అందించారు. ఇపుడు ఎంపీగా వెళ్తున్నారు అని చెబుతూ ఆయనను గెలిపించాలని కోరారు.

లోకల్ అన్న మాటతో జగన్ సీఎం రమేష్ అభ్యర్ధిత్వం గురించి చెప్పకనే చెప్పేశారు అని అంటున్నారు. సీఎం రమేష్ ఉత్తరాంధ్ర వాసి కానే కాదు, ఎక్కడో కడప నుంచి వచ్చినవారు. చంద్రబాబు భాషలో చెప్పాలంటే పారాచూట్ నేత. ఆయన ఓసీ అని అంటున్నారు. అందుకే బీసీ ఎంపీ సీట్లో బీసీ అభ్యర్ధి లోకల్ అని జగన్ బూడికి ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పేశారు.

జనాలు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. అనకాపల్లి వాసులు ఎపుడూ లోకల్ నే ఎన్నుకుంటారు. దాంతో ఈసారి ఎన్నికల్లో ఎవరు ఏమిటి అన్నది మరోసారి జనాలు తీర్పు విలక్షణంగానే ఇవ్వబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?