హైకోర్టు ఆదేశాల‌తో పోసానిపై కేసు న‌మోదు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సినీ న‌టుడు, వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళిపై కేసు న‌మోదు చేయాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయ‌న‌పై రాజ‌మండ్రి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సినీ న‌టుడు, వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళిపై కేసు న‌మోదు చేయాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయ‌న‌పై రాజ‌మండ్రి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల నారా, నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై పోసాని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం చూస్తున్నాం.

ఇటీవ‌ల నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో త‌మ పార్టీతో పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని పోసానిపై జ‌న‌సేన నేత‌లు ఫిర్యాదు చేశారు. జ‌న‌సేన పార్టీని ఎందుకు పెట్టారు?  చంద్ర‌బాబుకు ఊడిగం చేయ‌డానికా?  మ‌ళ్లీ టీడీపీ ప‌ల్ల‌కీని జ‌న‌సేన కేడ‌ర్‌తో మోయించ‌డానికా? అని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారంటూ జ‌న‌సేన నేత‌లు పేర్కొన్నారు.

పోసాని కామెంట్స్‌ను అభ్యంత‌ర‌క‌ర‌మైన‌విగా జ‌న‌సేన నేత‌లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. త‌మ ఫిర్యాదును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, పోసానిపై కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో జ‌న‌సేన నేత‌లు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో పోసానిపై కేసు న‌మోదు చేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజ‌మండ్రి పీఎస్‌లో పోసానిపై కేసు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ లెక్క‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ప్ర‌తిరోజూ రాజ‌కీయ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ఏపీలో రాజ‌కీయ నేత‌లు ప‌ర‌స్ప‌రం ఎలా తిట్టుకుంటున్నారో అంద‌రికీ తెలిసిందే. మ‌రి పోసాని విమ‌ర్శ‌లు జ‌న‌సేన నేత‌ల‌కు అనుచిత వ్యాఖ్య‌లుగా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.