చంద్రబాబు విడుదల అసాధ్యం అని ఫిక్సయ్యారా?

241 కోట్ల రూపాయలు స్వాహా చేసిన అవినీతి కేసులో ప్రస్తుతం రిమాండులో జైల్లో ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందా? చంద్రబాబును బెయిలుపై బయటకు…

241 కోట్ల రూపాయలు స్వాహా చేసిన అవినీతి కేసులో ప్రస్తుతం రిమాండులో జైల్లో ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందా? చంద్రబాబును బెయిలుపై బయటకు తీసుకురావడం అనేది న్యాయస్థానాల్లో సాధ్యం కాదని, ఆయన అవినీతి కేసులు చాలా బలంగా ఉన్నాయని న్యాయవాదులు కూడా చేతులెత్తేశారా… అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. 

చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మళ్లీ ప్రజల్లోకి వెళ్లడం అసాధ్యం అనే ఉద్దేశంతో.. తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయ నాయకత్వానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. నారా భువనేశ్వరి 5వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించడానికి పూనుకోవడాన్ని గమనిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతోంది.

చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రకు నారా భువనేశ్వరి డిసైడ్ అయ్యారు. ఈనెల 5వ తేదీను కుప్పం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆరోజులోగా వచ్చే తీర్పులను బట్టి.. ఆమె పాదయాత్ర నిర్ణయం ఫైనల్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

మొదటగా రాయలసీమ జిల్లాల మీదుగా భువనేశ్వరి పాదయాత్రకు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. భర్త చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారు. కొడుకు అరెస్టు భయంతో పరారీలో ఉన్నాడు. 41ఏ నోటీసులు కూడా సర్వ్ అయిన తర్వాత.. కొడుకు 4వ తేదీ విచారణకు వచ్చినా సరే, 5వ తేదీనాటికి కొడుకు కూడా అరెస్టు అవుతారనే భయం వారిలో ఉంది.

రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న లాజిక్ ఏంటంటే.. చంద్రబాబునాయుడు కనీసం బెయిలు మీద విడుదల అవుతారనే నమ్మకం ఉన్నా, లేదా, లోకేష్ అరెస్టు కాబోరనే విశ్వాసం ఉన్నా.. నారా భువనేశ్వరి స్వయంగా బస్సు యాత్ర చేయడానికి పూనుకునే వారు కాదని అంటున్నారు. ఆమె యాత్రకు డిసైడ్ కావడంలోనే.. బాబు బయటకు వచ్చే అవకాశం లేదని వారు నమ్ముతున్నట్టుగా తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. 

కనీసం భువనేశ్వరి 5వ తేదీ వరకు ఆగి, ఆరోజు కోర్టుల్లో ఏం తేలుతుందో చూసుకున్నాక, ఏం చేయాలని ఆలోచన చేసి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.