
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబునాయుడికి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు కంటే, ఆయన తనయుడు లోకేశ్‌కు బిగ్ రిలీఫ్ దొరికినట్టైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తండ్రికి రెగ్యులర్ బెయిల్ రాకపోతే పార్టీని నడిపే బాధ్యత లోకేశ్‌పై ఉండడం, పార్టీ శ్రేణుల ఆకాంక్షల మేరకు ఆయన ముందుకు నడపకపోవడంపై తీవ్ర అసంతృప్తి నెలకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో లోకేశ్ ఎగిరి గంతేసినంత పనైంది. చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో షరతులతో కూడిన మధ్యంత బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు షరతులన్నీ తొలగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. దీంతో చంద్రబాబు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
ఈ నెల 28లోపు చంద్రబాబు హెల్త్ రిపోర్టును విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 29 నుంచి చంద్రబాబు యధావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనొచ్చని న్యాయస్థానం వెల్లడించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇకపై బాబు జైలుకు వెళ్లాల్సిన అవసరం రాకపోవడం, ఎన్నికల ముంగిట రాజకీయ కార్యకలాపాలు ఊపందుకోడానికి ఏపీ హైకోర్టు తీర్పు వెసలుబాటు కల్పించినట్టైంది.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గడిపారు. ఎట్టకేలకు ఆయనకు న్యాయ స్థానంలో ఊరట దక్కడం విశేషం. తాజా పరిణామాలతో లోకేశ్‌కు పెద్ద ఉపశమనం లభించినట్టైంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపిణీ, జనసేనతో సమన్వయం తదితర అంశాలను డీల్ చేయగలిగే సామర్థ్యం లోకేశ్‌లో లేదు.
తండ్రి జైల్లో వుంటే, తనను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో లోకేశ్ ఢిల్లీకి వెళ్లడంపై టీడీపీ శ్రేణుల్లో ఎలాంటి అభిప్రాయం కలిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే మరికొంత కాలం చంద్రబాబు జైల్లోనే వుంటే, లోకేశ్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగి వుండేది. ఇప్పుడు అన్నీ చూసుకోడానికి చంద్రబాబుకు న్యాయ స్థానం కరుణ చూపింది. దీంతో లోకేశ్ హాయిగా సేదతీరొచ్చు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా