Advertisement

Advertisement


Home > Politics - Andhra

కొందరి అలకలనే తీర్చిన బాబు

కొందరి అలకలనే తీర్చిన బాబు

అలకలు అందరూ అలుగుతారు. కానీ చంద్రబాబు వద్ద మాత్రం కొందరి అలకలే తీరుతాయి అని టీడీపీ వర్గాలలో అనుకుంటున్న నేపధ్యం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నెల రోజుల పాటు నానా హడావుడీ చేశారు. పెందుర్తి సీటు తనకు ఇవ్వలేదని అధినాయకత్వం మీద మండిపడ్డారు.

రాజకీయాలకు ఒక దశలో దండం పెట్టారు. ఇలా బండారు చాలానే చేసిన మీదట బాబుతో వాదించి మరీ తన పంతం నెగ్గించుకున్నారు ఆయనకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఖాయం చేశారు. అదే ఉత్తరాంధ్రలో మరింతమంది తమ్ముళ్లు ఉన్నారు. వారు కూడా తమకు టికెట్ ఏదీ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలిగారు, ఆవేశపడ్డారు.

కానీ వారికి మాత్రం ఏమీ దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఈ రోజుకు సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి శ్రీకాకుళం టికెట్ దక్కలేదు. దాని వెనక జిల్లా పెద్దల పాత్ర ఉందని గుండ వర్గం ఆరోపించింది.

చంద్రబాబుని కలసి తమకు న్యాయం చేయాలని కోరింది. సీటుని గెలిపించుకుని తెస్తామని గుండ దంపతులు చెప్పారు. కానీ వారిని మాత్రం న్యాయం జరగలేదు. పైగా ఇక ఇంతే అని చెప్పేసింది హై కమాండ్. దాంతో గుండ దంపతులు మౌనముద్ర దాల్చారు. వారి అనుచరులను ఇపుడు గమ వైపు తిప్పుకునే కార్యక్రమం చేపట్టారు శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి. గుండ దంపతుల రాజకీయం 2024 ఎన్నికలతో ఇలా ఫోర్స్ డ్ పొలిటికల్ రిటైర్మెంట్ తో ఆగిపోతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. గుండ దంపతులు నామినేషన్లు దాఖలు చేస్తారా లేదా అన్నది కొద్ది రోజులలో తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?