Advertisement

Advertisement


Home > Politics - Andhra

దేశం గర్వించే నాయకుడు ఎవరంటే....?

దేశం గర్వించే నాయకుడు ఎవరంటే....?

బీజేపీ వారిని ఈ ప్రశ్న అడగకపోయినా ఠక్కున వారు చెప్పేది నరేంద్ర మోడీ అని. గతంలో అయితే వాజ్ పేయ్ పేరు చెప్పేవారు. ఇపుడు మోడీ జపమే చేస్తున్నారు. ఎందుకంటే రెండు దశాబ్దాల కాలం జరిగిపోయింది. వాజ్ పేయ్ ప్రధాని పదవి దిగిపోయారు. స్వర్గస్తులు అయ్యారు. ఇపుడు బీజేపీ అంటే మోడీనే అన్నట్లుగా కమల రాజకీయం సాగుతోంది.

ఆయన కాకుండా దేశమంతా గర్వించే నాయకుడు ఎవరు అంటే మా నాయకుడు అని చెబుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. రాహుల్ గాంధీని చూసి దేశం గర్వపడుతోంది అని రుద్రరాజు తనదైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. విశాఖపట్నంలో కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన రుద్రరాజు కాంగ్రెస్ దే రానున్న కాలమంతా అని ఆశాభావాన్ని వచ్చిన వారిలో నింపారు.

ఏపీలో కాంగ్రెస్ ని భవిష్యత్తు ఉందని, యువజన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రమంతటా తిరిగి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. దేశం బాగుపడాలంటే అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమని గిడుగు రుద్రరాజు అంటున్నారు. 

భారత్ ప్రగతి కాంగ్రెస్ తోనే ముడిపడి ఉందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ దేశం మొత్తం గర్వించే నాయకుడు అని గిడుగు అన్న మాటలకు బీజేపీ వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?