Advertisement

Advertisement


Home > Politics - National

డీపీ చూసి నచ్చితే వస్తా.. ర్యాపిడో డ్రైవర్ ర్యాగింగ్

డీపీ చూసి నచ్చితే వస్తా.. ర్యాపిడో డ్రైవర్ ర్యాగింగ్

ర్యాపిడో లో రైడ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ నుంచి వింత సమాధానం వచ్చింది. ర్యాపిడో యాప్ లో ఆమె రైడ్ కి బుక్ చేసిన వెంటనే.. డ్రైవర్ నుంచి ఆమె ఫోన్ నెంబర్ కి వాట్సప్ మెసేజ్ వచ్చింది. వాట్సప్ లో నీ డిస్ ప్లే పిక్చర్ కనపడ్డంలేదు, నన్ను నీ కాంటాక్ట్స్ లో యాడ్ చేసుకో అని మెసేజ్ పెట్టాడు డ్రైవర్. అంతే కాదు, “నీ డీపీ అయినా చూపించు, లేదా నీ వాయిస్ అయినా నాకు వినిపించు. ఆ రెండిటిలో ఏది నచ్చినా నేను రైడ్ కి రెడీ.. బట్ వన్ కండిషన్. నన్ను భయ్యా అని పిలవకూడదు.” అంటూ చాట్ చేశాడు.

ఈ చాటింగ్ తో ఆమె షాకైంది, ఈ ఘటనపై సదరు మహిళ ట్విట్టర్లో ర్యాపిడోకి ఫిర్యాదు చేసింది. వాట్సప్ స్క్రీన్ షాట్ ని కూడా షేర్ చేసింది. ర్యాపిడో యాప్ లో తన లొకేషన్ షేర్ చేసిన తర్వాత తనకి ఈ మెసేజ్ వచ్చిందని ఆమె ట్వీట్ చేసింది. అంతే కాదు, -- యువర్ యాప్, -- యువర్ మెన్ అంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చింది. దీంతో ర్యాపిడో యాజమాన్యం దిగొచ్చింది.

సహజంగా ఇలాంటి ఘటనల్లో యాజమాన్యాలు జరిగినదానికి చింతిస్తున్నాం అని సర్దిచెప్పుకుంటాయి. ర్యాపిడో కూడా ఇందులో తమ తప్పేమీ లేదని, డ్రైవర్ ని మందలిస్తామని బదులిచ్చింది. కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. 

ర్యాపిడో వల్ల భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగబోదని హామీ ఇచ్చింది. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ని మాకు పంపించండి, మేం మీకు ఎల్లప్పుడు సహాయపడతాం అని ర్యాపిడో నుంచి మెసేజ్ వచ్చింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?