ధర్మానది రాజకీయ వైరాగ్యమా.. ?

ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక పోటీ చేయను అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వవద్దు అని జగన్ కే చెప్పానని అంటున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా…

ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక పోటీ చేయను అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వవద్దు అని జగన్ కే చెప్పానని అంటున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన చెబుతున్నారు.

తనది నాలుగు దశాబ్దాల పైగా రాజకీయ జీవితమని, తాను చిన్న తనంలోనే రాజకీయాల్లోకి వచ్చి పన్నెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఆరు సార్లు గెలిచాను అని ఆయన తన గురించి వెల్లడించారు. తాను రాజకీయాల్లో లేకపోయినా ప్రజా సేవ చేస్తాను తనను పోటీ నుంచి తప్పించాలని పక్కన పెట్టాలని ధర్మాన అంటున్నారు.

ధర్మాన ఎందుకు ఇలా అంటున్నారు అన్నది వైసీపీలోనే ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి రెవిన్యూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని నడిపించమని అధినాయకత్వం కోరుతోంది. అయితే ధర్మానను ఈసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది.

ధర్మానకు అది ఇష్టం లేదని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి తన వారసుడు ధర్మాన రామ మనోహరనాయుడుకు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం అక్కడ కొత్త అభ్యర్ధిని ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి చూస్తోంది అని తెలుస్తోంది. ధర్మానను ఎంపీగా పోటీ చేయిస్తే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రభావం ఉంటుందని భావిస్తోంది.

ధర్మాన అక్కడ డిఫర్ అయ్యారని, ఆయన రాజకీయాల నుంచి అందుకే తప్పుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. తన వారసుడి కోసం ధర్మాన పదవీ త్యాగం చేయాలని చూస్తున్నారు తప్ప రాజకీయ వైరాగ్యం కానే కాదని అంటున్నారు. వారసుడికి టికెట్ వైసీపీ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.