Advertisement

Advertisement


Home > Politics - Andhra

నాడు బాబుపై గ‌గ్గోలు.. నేడు జ‌గ‌న్‌పై అవ‌హేళ‌న‌!

నాడు బాబుపై గ‌గ్గోలు.. నేడు జ‌గ‌న్‌పై అవ‌హేళ‌న‌!

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో వున్న  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిపై ఆగంతకులు రాయి విసిరి గాయపరిచారు. దీన్ని తనకు తాను చేసుకున్న దాడిగా కొందరు అవహేళన చేస్తున్నారు. తెలుగుదేశం అనుకూల మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి ప్రచారమే మొదలుపెట్టారు. సానుభూతి కోసం గత ఎన్నికల సమయంలో కోడికత్తితో ఉత్తుత్తి దాడి చేయించుకున్న జగన్ , ఇప్పడు కూడా అదే తరహా దాడి చేయించుకున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇది అమానవీయమైన ప్రచారం.

రాయి నుదుటిని తాకిందికాబట్టి సరిపోయింది. అదే కణితనో, తలనో తాకి వుంటే ఏమయ్యేది? ప్రాణాలు పోయేవి కావా? కాట్‌ బాల్‌తో కొడితే తప్ప ఇంత గాయమయ్యే అవకాశం లేదు. దూరం నుంచి వడిసెతోనో, కాట్‌ బాల్‌ తోనో విసిరిన రాయి తలకు తగిలితే ప్రాణాలు పోవడం ఖాయం. అదృష్టవశాత్తు జగన్‌ గాయంతో బయటపడ్డారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగినపుడు కూడా ‘కోడికత్తి దాడి’ అంటూ ఆనాటి ఘటనను తక్కువ చేసి చూపే ప్రయత్నిం చేసింది తెలుగుదేశం మీడియా. హత్యాయత్నాన్ని కూడా అవహేళనగా రాయడానికి ఏమాత్రం సంకోచించలేదు ఆ మీడియా. ఇప్పుడు కూడా అదే ధోరణిలో, తనదైన ఎదురుదాడి వ్యూహంతో రాతలు మొదలుపెట్టింది.

వైఎస్‌ జగన్‌ విషయంలో ఇంత అమాన‌వీయంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం అనుకూల మీడియా.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో ఎంత వింతగా ప్రవర్తించిందో చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు రిమాండ్‌పై రాజమండ్రి జైలులో వున్నప్పుడు పచ్చ మీడియా విస్తుగొలిపే విన్యాసాలు చేసింది. చంద్రబాబును దోమలున్న గదిలో వుంచడం ద్వారా...దోమలతో కుట్టించి చంపడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని టీవీల్లో వార్తా కథనాలు ప్రసారం చేశాయి.

ఇదే అంశంపై గంటల కొద్దీ చర్చలు నిర్వహించాయి. దోమల వల్ల డెంగ్యూ వ్యాధిని చంద్రబాబుకు సోకించి చంప‌డానికి కుట్ర చేస్తున్నారని జనాన్ని నమ్మించాయి. అంతేకాదు...జైలుకు దగ్గర్లో ఎక్కడో డోన్‌ తిరగడాన్ని ఆసరా చేసుకుని కథ‌లు అల్లాయి. డోన్‌ సాయంతో జైల్లోనే చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని స్వయంగా నారా లోకేష్‌ ఆరోపించారు. దీనిపైనా పచ్చ పత్రికల్లో పెద్దపెద్ద కథనాలు అచ్చేశారు.

జగన్‌ విషయంలో అలా...చంద్రబాబు విషయంలో ఇలా! దేన్నయినా తమ రాజకీయ ప్రయోజనానికి అనుకూలంగా చూపగల, ప్రచారం చేయగల ఘనత  మన పచ్చ మీడియాది. నందిని పందిని... పందిని నందిని చేయగలమన్న నమ్మకం పచ్చమీడియాది. అందుకే ఎంతటి అహేతుక ప్రచారాన్నయినా ఎలాంటి జంకూ లేకుండా చేసేస్తారు. అయితే...ఇది ఒకనాటి ఈనాడు వార్తల కాలం కాదు...ఇది "ఈ"వార్తల కాలం. నిమిషాల్లో ఎన్నో కోణాల్లో విశ్లేషణలు, పరిశీలనలు సామాజిక మాధ్యమాల్లో వచ్చేస్తున్నాయి. పంది ఏదో, నంది ఏదో, ఏవి పాలో, ఏవి నీళ్లో ఇట్టే తేల్చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పచ్చ మీడియాకు గొంతులో పచ్చి వెలక్కాయలా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?