
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆ సంగతి తనకు కనీసం జ్ఞాపకం లేనట్టుగా, తను అసలు తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో సంబంధమే లేని వ్యక్తిలాగా గడుపుతూ వచ్చిన నాయకుడు గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చారు.
తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల నియోజకవర్గంలో విజయం నమోదు చేయగనే.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయనే భ్రమలో ఉన్నట్టుంది గంటా శ్రీనివాసరావు అందుకని.. ఈ ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ కు చెంపదెబ్బ అంటూ హటాత్తుగా ట్రాక్ మీదకు వచ్చి డైలాగులు వల్లిస్తున్నారు. రాజధాని సహా వైసీపీ చెబుతున్న మాటలపై ప్రజలకు విశ్వాసం లేదు అంటూ పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు గంటా శ్రీనివాసరావు.
తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినప్పటికీ.. ఆ పార్టీ మొహం కూడా చూడకుండా ఇన్నాళ్లూ గడిపిన ఆయన ఈ మధ్య కాలంలో ఎన్ని రకాల వంకర రాజకీయాలు ప్రదర్శించారో లెక్కేలేదు.
తెలుగుదేశం పని అయిపోయిందని అనుకున్న తర్వాత.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పార్టీని వదిలించుకుని వేరే పార్టీల్లోకి వెళ్లిపోవాలని గంటా శ్రీనివాస రావు చేయని ప్రయత్నం లేదు.
బిజెపిలో చేరడానికి ఆయన ప్రయత్నించారు. ఈక్వేషన్స్ కుదరలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి మంతనాలు జరిపారు. స్థానికంగా ఆయన బద్ధశత్రువు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే, అవంతి శ్రీనివాస్ ను బైపాస్ చేసి ఇతర నాయకుల ద్వారా పావులు కదిపి వైసీపీలో చేరడానికి చూశారు. నిలకడలేని, అధికారం ఉన్న పార్టీల్లో ఉండడానికి మాత్రమే ఇష్టపడే గంటాను జగన్ చేరదీయలేదు. అయినా సరే.. తెలుగుదేశం పట్ల మాత్రం అంటీముట్టనట్టుగానే ఉండిపోయారు.
ఇప్పుడు పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజక వర్గంలో కొంచెం సానుకూలత కనిపించిన వెంటనే.. ఆయన మళ్లీ ట్రాక్ మీదకు వచ్చి గళమెత్తుతున్నారు. ఇలాంటి అవకాశ వాద నాయకుల పట్ల తెలుగుదేశం చంద్రబాబునాయుడు ఎలా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా ఉంది.
రెండు కారణాల చేత గంటా ఇప్పుడు తిరిగి యాక్టివ్ గా నటించినా చంద్రబాబు చేరదీసే అవకాశం ఉంది. ఒకటి- చంద్రబాబునాయుడుకు అంతకు మించి వేరే గత్యంతరం కూడా లేదు. రెండు- అవకాశవాద రాజకీయాకుల చంద్రబాబునాయుడే పెట్టింది పేరు. ఇలాంటి వారి వైఖరిని ఆయన చక్కగా అర్థం చేసుకోగలరు. మళ్లీ చేరదీయగలరు అని పార్టీలో అనుకుంటున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా