
తనను సస్పెండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో శాశ్వతంగా సస్పెండ్ అవుతుందంటూ శాపనార్థాలు పెట్టారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో కోటంరెడ్డి వార్తల్లో ఉన్నారు. అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హల్చల్ చేశారు.
ఇక ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసినట్టుగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన శాపనార్థాలతో రెచ్చిపోయారు!
2024 ఎన్నికల్లో రాజకీయ సునామీ రాబోతోందని అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చితికిపోతుదంటూ కోటంరెడ్డి చెప్పుకొచ్చారు! తను ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే తనను అనుమానించారని, ప్రజాసమస్యలను ప్రస్తావించి తను విసిగిపోయినట్టుగా కోటంరెడ్డి చెప్పుకొచ్చారు! గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఓటమి ప్రజానాడిని చాటి చెబుతోందని కోటంరెడ్డి అన్నారు!
మరి పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా.. అన్నట్టుగా, తనకు ఏదో మంటెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అయిన కోటంరెడ్డి శాపాలు ఫలిస్తాయా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే చంద్రబాబుతో సమావేశం అయ్యి, టికెట్ విషయంలో భరోసా పొందారనే పేరును కూడా ఈయన తెచ్చుకున్నారు. కనీసం కార్పొరేటర్ లెవల్ కాని వ్యక్తికి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావంలో ఉండిన వ్యాక్యూమ్ సానుకూలంగా మారింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన పార్టీపై ఈయన ఈ రేంజ్ లో ఫైర్ అయిపోవడంపై జనాలు కన్వీన్స్ అవుతున్నదేమీ లేదు! అయితే కోటంరెడ్డి మాత్రం పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నారు.
ఇక సస్పెన్షన్ కు గురైన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రిటైర్మెంట్ దశకు వచ్చిన మేకపాటి ఈ తిరుగుబాటుతో ఇంకా రాజకీయంగా ఏం సాధించే ప్లాన్ లో ఉన్నారో మరి!
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా