
వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విద్యలో చంద్రబాబు తనయుడు లోకేశ్ బాగానే శిక్షణ పొందారు. చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేయడాన్ని లోకేశ్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన రాజమండ్రిలో ఉంటూ తండ్రి అవస్థలు చూడలేక ఢిల్లీ వెళ్లినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా తన తండ్రి భద్రతపై లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబును అంతం చేయడమే జగన్ లక్ష్యమని ఆయన ఆరోపించడం చర్చనీయాంశమైంది.
"సైకో జగన్.. చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత"
డెంగ్యూతో ఖైదీ మృతి చెందగా, దాన్ని సాకుగా తీసుకుని లోకేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. మొదటి నుంచి చంద్రబాబు భద్రతపై భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దోమలకు విషం పూసి, వాటిని బాబుపై ప్రయోగిస్తారనే దుష్ప్రచారానికి కూడా టీడీపీ, ఎల్లో మీడియా దిగజారింది. ఈ పరంపరలో లోకేశ్ కూడా అదే ప్రచారానికి దిగారు. ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రలో భాగంగా లోకేశ్ తదితర నాయకులు విమర్శలు చేయడాన్ని గమనించొచ్చు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా