
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు వెనుక ఏం జరిగిందో ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ జారిపోకుండా సీఎం వైఎస్ జగన్, వైసీపీ ముఖ్య నేతలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కొంత అసంతృప్తితో ఉన్నారనే అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలను జగన్ తన దగ్గరికి పిలిపించుకుని మాట్టాడారు. ఈ క్రమంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆమె భర్తను గురువారం ఉదయం జగన్ పిలిపించుకున్నారు.
సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్ది సమయం ముందు ఈ వ్యవహారం నడిచింది. పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని జగన్ సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత ఇవ్వాలని శ్రీదేవి అడిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. తనకు టికెట్ ఇస్తామనే భరోసా ఇవ్వాలని శ్రీదేవి గట్టిగా పట్టుపట్టినట్టు తెలిసింది. తన అవసరాన్ని ఉందనే సాకుతో శ్రీదేవి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని జగన్ బావించారు. దీంతో ఆయన అసహనానికి గురయ్యారని తెలిసింది.
"నీ ఇష్టం వచ్చింది చేసుకోపో" అని జగన్ ఆగ్రహంతో ఊగిపోతూ శ్రీదేవికి తేల్చి చెప్పినట్టు తెలిసింది. తన ఓటు వేయకపోయినా ఫర్వాలేదనే రీతిలో సీఎం జగన్ మాట్లాడారని శ్రీదేవి నొచ్చుకున్నారు. ఇక తనకు టికెట్ ఇవ్వరని, అలాగే వైసీపీలో భవిష్యత్ లేదని శ్రీదేవి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయాలే.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేశారని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. శ్రీదేవికి నచ్చ చెప్పి వుంటే వైసీపీ వైపు ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా