
ప్రజలను ఈ రోజున ఎవరూ మభ్యపెట్టలేరని విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పధకాలు ఈ రోజు ప్రజల గుండెలలలో ఉన్నాయని అందుకే గడప గడపకు తాను తిరుగుతూంటే వారి కళ్ళలో ఆనందం కనిపిస్తోందని అన్నారు.
బయట ఎన్నో ప్రచారాలు చేయవచ్చు, కొన్ని పత్రికలు అయితే వైసీపీ మీద తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. కానీ అసలు వాస్తవాలు ఎవరూ దాచలేరని అన్నారు. తమ కుటుంబంలో జరుగుతున్న అభివృద్ధి అందుకుంటున్న సంక్షేమ పధకాల గురించి ప్రజలే తనకు నేరుగా వివిరిస్తున్నారని ఆయన అంటున్నారు.
విశాఖ తూర్పులో తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఒక్క తానేంటి ఏపీలో 175 సీట్లలో తమ పార్టీ అభ్యర్ధులు గెలవబోతున్నారు అన్నారు. జనం గుండెలలో ఏముంది అన్నది ఎవరూ గమనించడంలేదని అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు.
పాతికేళ్ళుగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో తాను నివసిస్తున్నానని ప్రజల సమస్యలు తనకు పూర్తిగా అవగాహన ఉందని, ఈసారి తూర్పు నుంచి వైసీపీ అభ్యర్ధి విజయం తధ్యం ఆ మార్పుని అంతా చూడబోతున్నారు అని ఎంవీవీ ధీమాగా చెబుతున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా