నెల్లిమర్లలో వైసీపీ సేఫ్!

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైసీపీ సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. అసలే బలంగా ఉన్న వైసీపీకి టీడీపీ జనసేన పొత్తులో ఈ సీటు జనసేనకు కేటాయించడం కలసివచ్చేలా ఉందని అంటున్నారు. పట్టుబట్టి జనసేన…

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైసీపీ సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. అసలే బలంగా ఉన్న వైసీపీకి టీడీపీ జనసేన పొత్తులో ఈ సీటు జనసేనకు కేటాయించడం కలసివచ్చేలా ఉందని అంటున్నారు. పట్టుబట్టి జనసేన ఈ సీటు సాధించినప్పటికీ ఈ సీటులో అసలైన బలం టీడీపీకే ఉందని అంటున్నారు.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి ప్రస్తుత టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు బలమైన నేతగా ఉన్నారు. కర్రోతుకే టికెట్ అని అంతా అనుకున్నారు. పతివాడ తమ కుటుంబానికే టికెట్ అని ధీమా పడుతోంది. అయితే ఈ ఇద్దరికీ షాక్ ఇస్తూ జనసేనకు ఈ టికెట్ ని ఇచ్చేశారు.

జనసేన తరఫున లోకం మాధవికి అలా టికెట్ దక్కింది. నెల్లిమర్ల విషయం తీసుకుంటే 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి మాత్రమే టీడీపీ గెలిచింది. ఒకసారి కాంగ్రెస్ తరఫున 2019లో వైసీపీ తరఫున బడుకొండ అప్పలనాయుడు గెలిచారు. ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే 23 వేల ఓట్లు సంపాదించారు.

బలమైన నేతగా ఉన్న ఆయనకే వైసీపీ మరోమారు టికెట్ ఇస్తోంది. ఇపుడు జనసేనకు టికెట్ ఇవ్వడంతో వైసీపీ నెత్తిన పాలు పోసినట్లు అయింది అని అంటున్నారు. టీడీపీలో వర్గ పోరు ఉంది. జనసేనకు ఎంతవరకూ సపోర్ట్ దక్కుతుందో తెలియదు. దాంతో ఈ సీటులో వైసీపీ సేఫ్ గా గెలిచేందుకు వీలుంది అని అంటున్నారు.

ఈ సీటు విషయంలో టీడీపీ అధినాయకత్వం తప్పు చేసిందని కూడా అంటున్నారు. బలమైన నేతలు సొంత పార్టీలో ఉండగా కాదని జనసేనకు ఇవ్వడం వల్ల ఫలితాలు తారు మారు అవుతాయని అంటున్నారు. అయితే జనసేన వత్తిడి పెట్టి మరీ ఈ సీటుని దక్కించుకుందని అంటున్నారు. సీటు వచ్చినా గెలుపు దక్కాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.

టీడీపీ జనసేన ఉమ్మడిగా కలసి వస్తే ఏమో కానీ జనసేనకు మద్దతు దక్కపోయినా ఓట్ల బదిలీ సాఫీగా సాగకపోయినా వైసీపీ మరోసారి భారీ మెజారిటీతో ఈ సీటుని దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు.