Advertisement

Advertisement


Home > Politics - Andhra

కొత్త పార్లమెంట్.. ఉక్కు సెంటిమెంట్

కొత్త పార్లమెంట్.. ఉక్కు సెంటిమెంట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ ని ప్రారంభించారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం అని బీజేపీ నేతలు కొనియాడారు. కొత్త పార్లమెంట్ పవిత్రతకు చిహ్నం అని కూడా పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ లో అయినా విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రైవేట్ నుంచి మోక్షం లభిస్తుందా అని విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యోగులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొత్త పార్లమెంట్ మొత్తంగా పరచుకున్న ఉక్కును చూసి అయినా కేంద్ర పెద్దల మనసు మారుతుందని వారు తలపోస్తున్నారు.

కొత్త పార్లమెంట్ నిర్మాణానికి వాడినది పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి చేసిన ఉక్కునే అని చెబుతున్నారు. విశాఖ ఉక్కు గురించి కొత్త పార్లమెంట్ కి వేరే ఎవరూ చెప్పాల్సింది ప్రత్యేకంగా చర్చకు పెట్టాల్సింది ఏదీ లేదని అంటున్నారు.

అణువణువునా విశాఖ ఉక్కును కలబోసుకుని నిర్మితం అయిన కొత్త పార్లమెంట్ ను చూసి అయినా ఆ సెంటిమెంట్ ని అర్ధం చేసుకుని అయినా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఒకే ఒక్క మాట కేంద్ర పెద్దలు చెప్పాలని కోరుకుంటున్నారు.

విశాఖ ఉక్కు ఉత్పత్తులలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. సొంత గనులు కేటాయించకపోయినా అనేక సందర్భాలలో లాభాల బాట పట్టింది. అంతర్జాతీయంగా విశాఖ ఉక్కు నాణ్యతలో అగ్రస్థానంలో ఉంది. అలాంటి ఉక్కు దేశంలోనే ముందు వరసలో ఉంటూ రాణిస్తోందని, దానికి చేయూతని ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్రమే ప్రైవేట్ బాట పట్టించాలనుకోవడం బాధాకరమని అంటున్నారు. 

విశాఖ ఉక్కుకు కొత్త పార్లమెంట్ తగిన న్యాయం చేస్తుందని అంతా ఆశపడుతున్నారు. ఉక్కు సెంటిమెంట్ ఫలిస్తుందా కేంద్ర పెద్దలు కరుణిస్తారా అన్నది రానున్న వర్షాకాల సమావేశాలలో తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?