బండారు సీటు చిరిగినట్లేనా…?

అరెస్ట్ అయింది. బెయిల్ వచ్చింది. అయినా అసలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా అన్నది మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అనుచరులను పట్టి పీడిస్తోంది. ఒక్కసారిగా ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తేసి…

అరెస్ట్ అయింది. బెయిల్ వచ్చింది. అయినా అసలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా అన్నది మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అనుచరులను పట్టి పీడిస్తోంది. ఒక్కసారిగా ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తేసి సెన్సేషన్ క్రియేట్ చేద్దామని బండారు అనుకున్నారు. కానీ సీన్ సితార్ అయింది అంటున్నారు.

బండారు పెందుర్తి నుంచి ఈసారి పోటీకి సిద్ధపడుతున్నారు. తాను కాకపొతే తన కుమారుడికి టికెట్ కోసం ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారు. జనసేన పొత్తు కలవడంతో సహజంగానే కలవరం రేగుతోంది. వైసీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుని కోరి మరీ పార్టీలోకి తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

పవన్ కోరుకున్న సీట్లలో పెందుర్తి ఒకటి. ఆయన వత్తిడి పెడితే చంద్రబాబు తప్పకుండా ఇస్తారు అని అంటున్నారు. దాంతో తన సీటు దక్కించుకునేందుకు బండారు మహిళా మంత్రి ఆర్కే రోజా మీద మండిపడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. అది కాస్తా బూతుల బండారుగా ఆయన్ని మిగిల్చింది.

అరెస్ట్ అయ్యారు అన్న సానుభూతి సొంత అనుచరులలో తప్ప బయట ఎక్కడా లేదు. వైసీపీ ఆ వేడిని చల్లారకుండా చూస్తూ విశాఖలో మహిళా నేతల నాయకత్వంలో ఆందోళనలు చేపట్టింది. ఇలా బండారు ఇంటా బయటా పలుచన అవుతున్న సందర్భంలో పెందుర్తి సీటు చిరిగిపోయేలా ఉంది అని అంటున్నారు. తన రాజకీయ వారసుడికి బండారు ఈ విధంగా అన్యాయం చేశారా అన్నది కూడా డిస్కషన్ గా ఉంది. ఈసారి టికెట్ రాకపోతే బండారు పొలిటికల్ లైఫ్ దాదాపుగా క్లోజ్ అయినట్లే అంటున్నారు.