ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గుర్తు కూడా ఉండ‌బోదా?

జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కింద ర‌ద్దు చేసింది. రిజిస్ట‌ర్డ్ పార్టీ అయిన జ‌న‌సేన గ‌త ఎన్నిక‌ల్లో గాజుగ్లాసు తో పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే…

జ‌న‌సేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంత కాలం కింద ర‌ద్దు చేసింది. రిజిస్ట‌ర్డ్ పార్టీ అయిన జ‌న‌సేన గ‌త ఎన్నిక‌ల్లో గాజుగ్లాసు తో పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌నీస స్థాయిలో ఓట్ల‌ను సంపాదించ‌లేక జ‌న‌సేన ఆ గుర్తును కూడా కోల్పోయింది. మ‌రి జ‌గ‌న్ స్థాయి గురించి మాట్లాడే ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఒక‌సారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి క‌నీసం కొంత శాతం ఓటు బ్యాంకును సంపాదించి ఒక ప‌ర్మినెంట్ గుర్తును సంపాదించ‌లేక‌పోయాడు! రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఆయ‌న జ‌గ‌న్ స్థాయి గురించి మాట్లాడ‌తారు!

ఆ సంగ‌త‌లా ఉంటే… ఇంత‌కీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గుర్తు ఏంటి? అమాయ‌క జ‌నసైనికులేమో ఇంకా గాజు గ్లాస్ లో టీ తాగుతూ అదే త‌మ గుర్తు అని ఫొటోలు పెట్టుకుంటూ ఉంటారు! ఆ గుర్తు మీకు ఎప్పుడో ర‌ద్దు అయ్యింది అని వారికి చెప్పినా అర్థం కాదు. ప‌వ‌న్ సినిమాల్లో కూడా ఆ గాజు గ్లాసుతోనే పోజులు ఇస్తుంటే.. అది వారికి ఎప్పుడు అర్థం కావాలి!

మ‌రి బ‌హుశా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గుర్తుగా ఏదీ అస‌లు ఉండ‌క‌పోవ‌చ్చ‌నే టాక్ కూడా ఇప్పుడు న‌డుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేప‌థ్యంలో సైకిల్ గుర్తు మీద‌నే జ‌న‌సేన అభ్య‌ర్థులు పోటీ చేయ‌వ‌చ్చున‌ట‌! మ‌రి సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన‌ప్పుడు వాళ్లు జ‌న‌సేన నేత‌లు ఎలా అవుతారు? అనేది వేరే సంగ‌తి.

అస‌లు అభ్య‌ర్థులను పోటీకి పెట్టాలి, అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించాలి.. అనే ల‌క్ష్యాలు ఏవీ ప‌వ‌న్ కు లేవు! అవేమైనా ఉండేవాడు అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కూడా వెళ్లేవాడు కాదు! ప‌వ‌న్ ల‌క్ష్యం జ‌గ‌న్ ను ఓడించ‌డం అనేది మాత్ర‌మే! కాబ‌ట్టి.. సైకిల్ గుర్తు మీద 175 స్థానాల్లోనే అభ్య‌ర్థుల‌ను పెట్టి.. వారిలో కొంత‌మంది జ‌న‌సేన  అని అనిపించుకోవ‌డానికి ప‌వ‌న్ రెడీ అనొచ్చు. ఎన్నిక‌ల త‌ర్వాత ఎలాగూ అంతా చంద్ర‌బాబుకు జీహుజూర్ అనే వారే. ప‌వ‌న్ ఎలాగూ అప్పుడు సినిమాల‌తో బిజీ అయిపోతాడు! అప్పుడ‌ప్పుడు వ‌చ్చి హ‌డావుడి సాగిస్తూ ఉంటాడు. ఇదే సీరియ‌ల్ కొన‌సాగ‌నూ వ‌చ్చు.

గ‌తంలో త‌మిళ‌నాట శ‌ర‌త్ కుమార్ ఒక పార్టీని పెట్టాడు. ఆ పార్టీ వెళ్లి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. శ‌ర‌త్ కుమార్ తో పాటు మ‌రొక‌రికి ఒక సీటును కేటాయించింది జ‌య‌ల‌లిత‌. ఆ రెండు సీట్ల‌లో పోటీ చేసిన ఆ పార్టీ వేరే గుర్తు మీద పోటీ చేయ‌లేదు. అన్నాడీఎంకే రెండాకుల గుర్తు మీదే ఆ పార్టీ కూడా పోటీ చేసింది. పేరుకేమో వారు శ‌ర‌త్ కుమార్ పార్టీ ఎమ్మెల్యేలు. గుర్తు అన్నాడీఎంకేది. ఐదేళ్ల పాటు అలా రెండు ఎమ్మెల్యే సీట్ల‌తో ఉనికిలో ఉండిన శ‌ర‌త్ కుమార్ పార్టీ ఆ త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయింది. వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేయ‌డం అంటే.. జ‌న‌సేన ఊసుకు కూడా అది బ‌హుశా ఆఖ‌రి ఎన్నిక అయ్యే అవ‌కాశ‌మూ ఉంది.