Advertisement

Advertisement


Home > Politics - Andhra

నామినేష‌న్ల‌కు వేళాయె..!

నామినేష‌న్ల‌కు వేళాయె..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు, లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కు స‌మ‌యం ఇంకా ఉన్నా.. నామినేష‌న్ల ప్ర‌క్రియ మాత్రం మొద‌ల‌వుతోంది. గురువారం ఏపీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ , లోక్ స‌భ ఎన్నిక‌ల నాలుగో విడ‌త నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో పాటు.. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా మొద‌ల‌వుతోంది. వారం రోజుల పాటు నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేసుకోవ‌చ్చు ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌నుకుంటున్న వాళ్లు!

ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. అయితే అలాంటి ప్ర‌క‌ట‌న త‌ర్వాత కూడా మార్పుల ఊహాగానాలు కొన్ని చోట్ల ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల జాబితాలో రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు అంటున్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అభ్య‌ర్థుల జాబితాలో ఇప్ప‌టికే ప‌లు చోట్ల మార్పులు చేశారు! మ‌రి కొన్ని చోట్ల మార్పులు త‌ప్ప‌నిస‌రి అనే టాక్ వ‌స్తోంది.

ఇలాంటి నేప‌థ్యంలో ఈ క‌థంతా వారం రోజుల్లో క్లారిటీ వ‌చ్చే రానుంది. పార్టీల అధికారిక అభ్య‌ర్థులు ఎవ‌రు, రెబెల్స్ ఎవ‌రు, ఇండిపెండెంట్లుగా నిల‌బ‌డే స‌త్తా ఎవ‌రిదో స్ప‌ష్టత రానుంది. ఈ నెల 25 వ తేదీ వ‌ర‌కూ నామినేష‌న్ల దాఖ‌లుకు అవ‌కాశం ఉంటుంది. 26న ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. 29 వ తేదీ వ‌ర‌కూ నామినేష‌న్ల విత్ డ్రాకు అవ‌కాశం ఉంది.

ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌, లోక్ స‌భ స్థానాల ఎన్నిక‌ల ప్ర‌క్రియ కీల‌క ఘ‌ట్టంలోకి ప్ర‌వేశంచింది. నామినేష‌న్ల దాఖ‌లు మొద‌లుకావ‌డంతో.. సర్వేలకు కూడా బ్రేక్ ప‌డిన‌ట్టే. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ర‌క‌ర‌కాల స‌ర్వేలు వెల్ల‌డ‌య్యాయి. నోటిఫికేష‌న్ విడుద‌ల‌తో స‌ర్వేల ప్ర‌క‌ట‌న‌ల‌కు బ్రేక్ ప‌డింది. దేశంలోని మొత్తం లోక్ స‌భ స్థానాల పోలింగ్ వ‌ర‌కూ ఇక ప్రీపోల్ సర్వేలకూ, ఎగ్జిట్ పోల్స్ కు అవ‌కాశం ఉండ‌దు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?