Advertisement

Advertisement


Home > Politics - Andhra

కమలం ఓటు బదిలీ కలలో మాట!

కమలం ఓటు బదిలీ కలలో మాట!

పచ్చ మీడియా క్లారిటీ ఇచ్చింది. నిన్నటి రోజున చంద్రబాబునాయుడు- పవన్ కల్యాణ్ మాత్రమే కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో.. కేవలం ఆ రెండు పార్టీలకు సంబంధించినది మాత్రమే. ఎన్డీయే కూటమి అని చెప్పుకుంటున్నారు గానీ.. భారతీయ జనతా పార్టీకి గానీ, ప్రధాని నరేంద్రమోడీకి గానీ ఆ హామీలతో సంబంధం లేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఏపీలో అభివృద్ధి చేస్తాం అని కూడా ఆ మేనిఫెస్టోలో ప్రకటించారు గానీ.. ఆ మాటలను భాజపా ధ్రువీకరించినట్టు కాదు.

జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు కలిసి విడుదల చేస్తున్న మేనిఫెస్టో మీద తన ఫోటో వేయడానికి వీల్లేదని ఢిల్లీనుంచి ప్రధాని మోడీ చాలా గట్టిగా ఆదేశించినట్టుగా చెబితే.. ఆయన ఏదో కక్షతో అలా రంగు పులుముతున్నారని పచ్చదళాలు ఆక్రోశించాయి. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఇన్చార్జి కూడా ఉన్నారు కదాని గోలచేశాయి. కానీ ఈనాడు వార్త కూడా ఇప్పుడు అదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. నిన్న విడుదల అయినది తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అని ఈనాడు వార్త  శీర్షికలోనే పెట్టారు. దాంతో భాజపాకు సంబంధం లేదని అధికారికంగా వారే ధ్రువీకరించినట్టు లెక్క.

పేరుకు భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు కేటాయించి.. ఆ సీట్లలో అంతో ఇంతో గట్టి పోటీ ఇవ్వగల సీట్లలో తన కోవర్టులకే టికెట్లు ఇచ్చేలా గ్రంథం నడిపి, తతిమ్మా ఓడిపోయే సీట్లను వారికి అంటగట్టి, చివరికి తెలుగుదేశం నేతలనే ఆ పార్టీలోకి పంపి చివరిక్షణంలోనూ టికెట్ ఇప్పించి.. తెరవెనుక మంత్రాంగాలు నడిపిన చంద్రబాబునాయుడు కుటిలనీతిని భారతీయ జనతా పార్టీ ఇప్పటికి అర్థం చేసుకున్నట్లుంది.

ఈ పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య అసలు ఓటు బదిలీ సాధ్యమేనా అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. తెలుగుదేశం ఇన్ని రకాలుగా ఇప్పటికీ తమను వంచిస్తున్నదని అర్థమైన తర్వాత కూడా బిజెపి ఓట్లు, వారి పోటీ చేయని నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి, జనసేనకు పడతాయా అనే అనుమానం పలువురిని వెన్నాడుతోంది. అదే జరిగితే కూటమి అభ్యర్థుల విజయావకాశాలకు గండిపడినట్టే.

బిజెపి ఓట్లు బదిలీకావడం లేదని ఇంకో వారం రోజుల్లో క్లారిటీ వచ్చినా కూడా.. తక్షణం బిజెపి పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారిని ఓడించేలా చంద్రబాబు చక్రం తిప్పగలరు. అంతిమంగా.. మేనిఫెస్టో పుణ్యమాని.. కూటమి ముసుగులో ఉన్న కుమ్ములాటలు బయటకు వచ్చాయని ప్రజలు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?