Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీ వంశీకి జనసేన షాక్?

వైసీపీ వంశీకి జనసేన షాక్?

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఒకే ఒక కారణంతో వైసీపీని వీడి జనసేనలో చేరాను అని చెప్పుకున్నారు విశాఖకు చెందిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్. ఆయన నాలుగేళ్ల పాటు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉండగానే అనర్హత వేటు వేయించుకుని కూడా జనసేన గూటికి చేరారు.

ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ప్రామిస్ తోనే ఇదంతా చేశారు అని అంటున్నారు. ఆయన జనసేనలో చేరినపుడు ఇచ్చిన హామీ భీమునిపట్నం సీటు అని. ఆ తరువాత పొత్తుల సమీకరణల్లో మార్పు వల్ల ఆయనకు విశాఖ సౌత్ సీటు కేటాయించారని ప్రచారం సాగింది.

అనధికారికంగా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనిచేసుకోమన్నారు అని టాక్. ఈ విషయం తెలిసిన తరువాత విశాఖ సౌత్ నుంచి చాలా మంది జనసేన నేతలు రచ్చ చేయడంతో పాటు గెలిచే సీటు నియోజకవర్గానికి సంబంధం లేని వంశీకి ఎలా ఇస్తారు అని నిలదీశారు.

దీంతో ఇపుడు జనసేన అధినాయకత్వం పునరాలోచనలో పడింది అని అంటున్నారు. మొత్తం 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ఆదివారం ప్రకటించిన పవన్ విశాఖ సౌత్ ని మాత్రం పెండింగులో పెట్టేశారు. ఇదే ఇపుడు వంశీ అనుచరులలో గుబులు రేపుతోంది.

సీటు వచ్చినట్లే వచ్చి చేజారిపోతోందా అన్న ఆందోళన వారిలో బయల్దేరింది. వంశీకి ఈ సీటు ఇవ్వకపోతే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని అంటున్నారు. ఆయన పార్టీ మారకుండా ఉన్నా ఎమ్మెల్సీగా కొనసాగేవారు అని అంటున్నారు.

ఇపుడు జనసేన హ్యాండ్ ఇస్తే కనుక వంశీ వరసగా రెండు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోయిన వారుగా ఉంటారు అని అంటున్నారు. రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా ఆ హామీ ప్రకారం ఎమ్మెల్సీ వంటి పదవి దక్కినా వైసీపీని వదిలి ఇంతలా హైరానా పడిన తరువాత కూడా వంశీకి దక్కిందేమిటి అన్నదే అనుచరులలో కలుగుతున్న ఆలోచన. వంశీకి టికెట్ ఇస్తారా లేదా అన్నది వారిని టెన్షన్ పెడుతోందిట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?