
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేయడంపై సెటైర్స్ పేలుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి పురస్కారాన్ని గత రాత్రి ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. బ్రహ్మానందం నటన చూడాల్సిన అవసరం లేకుండానే, ఆయన పేరు వింటే చాలు నవ్వకుండా వుండలేరు. టాలీవుడ్‌లో బ్రహ్మానందం అద్భుత హాస్య నటుడంటే ... రెండో అభిప్రాయానికి చోటులేదు.
అయితే ఇటీవల కాలంలో రాజకీయ తెరపై మెగా బ్రదర్ నాగబాబు అద్భుతమైన హాస్యాన్ని పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రహ్మానందానికి అవార్డు ప్రదానం చేయడాన్ని పురస్కరించుకుని, నాగబాబుతో పోల్చుతూ రాజకీయంగా ఆయనపై వ్యంగ్య పోస్టులు పెట్టడం విశేషం. నాగబాబు భలే చిత్రమైన నాయకుడు. అసలు తానేం మాట్లాడుతున్నారో, చేస్తున్నారో కూడా ఆయనకు గమనం ఉన్నట్టు లేదు.
‘కథాకళి-2’ పేరిట నాగబాబు వీడియో విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఈ వీడియో ఉద్దేశం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడానికి అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాల్సి వుంటుంది. అయితే నాగబాబు వీడియోలో కామెడీ ఏంటంటే... జగన్‌ను మాత్రమే టార్గెట్ చేయడం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్‌తో నాగబాబు నిర్వహించిన చర్చకు సంబంధించి వీడియో జనసేన కార్యకర్తల్ని ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగు, తాగునీటితో పాటు వేల కోట్ల ఆదాయ వనరులను అందించే అక్షయ పాత్ర లాంటి పోలవరం ప్రాజెక్టుని ప్రభుత్వం గాలికి వదిలేసిందని నాగబాబు విమర్శించారు. పోలవరం నిర్మాణం పూర్తయితే ప్రతి ఏడాది ఎంతెంత ఆదాయం రాష్ట్రానికి వస్తుందో ఆయన లెక్కలతో సహా వివరించారు. జగన్ హయాంలో పోలవరం పూర్తయ్యే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తవుతుందో, లేదోనని నాగబాబు నిరాశగా చెబుతారు.
నీతి, నిజాయితీ, రైతులు పట్ల ప్రేమ ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలో పోలవరం కడతారని, ప్రజలు సంతోషంగాగా ఉంటారని జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. బాగా చెప్పావంటూ అజయ్‌ని నాగబాబు అభనందిస్తూ చేతులు కలుపుతారు. ఒకవైపు తాను సీఎం రేస్‌లో లేనని పవన్‌కల్యాణ్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగబాబు, అజయ్ మధ్య చర్చ సారాంశం... ఇక ఎప్పటికీ పోలవరం పూర్తి కాదని తేల్చడమే. అందుకే నాగబాబు ఇటీవల కాలంలో హాస్యాన్ని బాగా పండిస్తున్నారని చెప్పడం. ఎన్టీఆర్ పురస్కారాన్ని వచ్చే ఏడాదైనా ఆయనకు ఇవ్వాల్సిన అవసరం వుంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా