Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నాలుగు నెలల క్రితం దేశానికి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఇప్పటిదాకా దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు రాలేదు. అలా ఫస్ట్ టైం సౌత్ టూర్ పెట్టుకున్న రాష్ట్రపతి విశాఖకు వస్తున్నారు. డిసెంబర్ 4న తూర్పు నావికాదళం ఆద్వర్యంలో జరిగే నౌకాదళ దినోత్సవంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొంటారు.

ఆమెతో పాటు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తున్నారు. విశాఖ సాగర తీరంలో నావికాదళ విన్యాసాలను రాష్ట్రపతితో కలసి ముఖ్యమంత్రి జగన్ వీక్షిస్తారు.

గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ ఉత్సవాలు జరపలేదు. ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించేందుకు నేవీ అధికారులు  ప్లాన్ చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా తూర్పు నావికాదళ సామర్ధ్యం పూర్తి స్థాయిలో బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పటికే నావికాదళ ఉత్సవాలకు సంబంధించిన ముందస్తు సన్నాహాలు మొదలయ్యాయి.

రాష్ట్రపతి వస్తున్న నేపధ్యంలో విశాఖ మరోసారి పూర్తిగా భద్రతావలయంలోకి వెళ్ళిపోనుంది. సరిగ్గా ఇరవై రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వచ్చి రెండు రోజుల పాటు ఉన్నారు. ఇక ఇదే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి అప్పటి రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్  హాజరయ్యారు. ఇలా ఒకే ఏడాది ఇద్దరు రాష్ట్రపతులు విశాఖ రావడం అరుదైన ఘటన అయితే అదే ఏడాదిలో ప్రధాని కూడా రావడంతో విశాఖ ఖ్యాతి జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా