
కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని డాక్టర్ నర్రెడ్డి సునీత వెంటాడుతున్నారు. ఎలాగైనా అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయించాలనే పట్టుదలతో ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు... ఇలా ఆమె ఎక్కని న్యాయస్థానం మెట్లు లేవు. వివేకా హత్య కేసులో ఇటీవల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెలాఖరుకు వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముగించాల్సి వుంది. ఈ నేపథ్యంలో సీబీఐ అనుకున్న ప్రకారం ఒక్క అవినాష్‌రెడ్డి మినహాయించి, మిగిలిన నిందితులందరినీ అరెస్ట్ చేశారు.
అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినాష్ అరెస్ట్ అదిగో, ఇదిగో అంటూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరికి తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను ఆకాంక్షిన వారంతా డీలాపడ్డారు. వీరిలో అతి ముఖ్యమైన వ్యక్తి వివేకా కుమార్తె డాక్టర్ సునీత. అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆమె తరపు న్యాయవాది తీవ్రస్థాయిలో వాదించినప్పటికీ, నిరాశే మిగిలింది.
దీంతో అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సవాల్‌ను డాక్టర్ సునీత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో సునీత కోరారు. అవినాశ్‌పై అభియోగాలన్నీ తీవ్రమైనవేనని ఆమె పేర్కొనడం గమనార్హం.
సీబీఐ అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని, హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని పిటిషన్‌లో సునీత ప్రస్తావించారు. సుప్రీం వెకేషన్ బెంచ్ సునీత పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్‌కు ఊరటనిచ్చే తీర్పు ఇవ్వగా, సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా