
51 వేల కుటుంబాలకు పైగా నిరుపేదలకు అమరావతి రాజధానిలో నివాస స్థలాల పంపిణీకి గడువు దగ్గరపడే కొద్ది కొందరికి కడుపు మంట అంతకంతకూ పెరుగుతోంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో మరోసారి రైతులు, మహిళలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారంటూ ఎల్లో మీడియా రాసుకొచ్చింది.
మహిళలు, రైతులపై పోలీసులు నోటి దురుసు ప్రదర్శించారని చెబుతున్నారు.
"ఏంటే గొంతు లేస్తోంది. ఎక్కువ మాట్లాడుతున్నావ్".. "ఏయ్ డొక్కలు పగులుతాయ్. శిబిరం నుంచి బయటకి రండి. మీ పని చెబుతా"...మహిళా రైతులపై పోలీసుల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటిని ప్రజాస్వామిక వాదులెవరైనా ఖండించాల్సిందే. అయితే వైసీపీ ప్రభుత్వ కర్కశత్వాన్ని హైలెట్ చేస్తూ, టీడీపీతో పాటు ప్రతిపక్షాల మానవత్వం ఎక్కడనే ప్రశ్న ఉత్పన్నమైంది. అమరావతి రైతులు, మహిళల ఆందోళనకు మద్దతుగా ఏ ఒక్కరాజకీయ పార్టీ పాల్గొనకపోవడం ఏంటనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
కేవలం తమ శిఖండిని మాత్రమే ముందు పెట్టి, టీడీపీ ఏం సాధించాలని అనుకుంటోందనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. టీడీపీ, జనసేన, వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలంతా ఏమయ్యారు? అలాగే అమరావతి పరిరక్షణ పేరుతో కోట్లాది రూపాయల విరాళాలు సేకరించి ఉద్యమం నడిపిన నాయకులు అక్కడ కనపడలేదేం? నివాస స్థలాలు పొందుతున్న లబ్ధిదారుల ఆగ్రహానికి గురి అవుతామనే భయంతో రాజకీయ పార్టీలు దీక్షకు ముందుకు రాలేదంటే సరిపెట్టుకోవచ్చు.
కానీ గద్దె తిరుపతిరావు, శివారెడ్డి పువ్వాడ సుధాకర్, రాయపాటి శైలజ, సుంకర పద్మశ్రీ, కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు తెనాలి శ్రావణ్ కుమార్ తదితర నాయకులంతా ఏమయ్యారు? ఇప్పుడు పోలీసుల కర్కశత్వానికి బలి అవుతున్నదంతా సామాన్య రైతులు, మహిళలేనా? ఇక్కడ కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై ఏపీ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని ప్రచారం చేస్తూ, దాన్ని సొమ్ము చేసుకునే ఎత్తుగడలో భాగంగా ఎల్లో మీడియాలో పతాక శీర్షికలతో కథనాలను ప్రచురిస్తున్నారు.
నిజంగా బాధితుల పట్ల సానుభూతి వుంటే దీక్షా శిబిరంలో టీడీపీ, జనసేన తదితర ప్రజాదరణ పార్టీల నేతలు పాల్గొనాలి కదా అని మాటకు ఏమని సమాధానం చెబుతారు? కష్టకాలంలో రోడ్డున పడ్డ రైతులు, మహిళలకు అండగా నిలబడకపోవడం కర్కశత్వం కాదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ కలిసి రాజధాని రైతుల్ని వాడుకుంటున్నారనేది పచ్చి నిజం. ఇందుకు తాజా ఘటనలే నిలువెత్తు నిదర్శనం.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా