టీడీపీకి సీనియర్లు గుదిబండలేనా…?

తెలుగుదేశం పార్టీ పెట్టింది పుట్టింది లగాయితూ అందులోనే ఉంటూ ఎప్పుడు ఎన్నికల్లో టికెట్లు అందుకుంటూ అధికారంలోకి పార్టీ వస్తే అందలం ఎక్కుతూ వస్తున్నారు చాలా మంది సీనియర్లు. తీరా వారు పార్టీకి ఏమైనా అక్కరకు…

తెలుగుదేశం పార్టీ పెట్టింది పుట్టింది లగాయితూ అందులోనే ఉంటూ ఎప్పుడు ఎన్నికల్లో టికెట్లు అందుకుంటూ అధికారంలోకి పార్టీ వస్తే అందలం ఎక్కుతూ వస్తున్నారు చాలా మంది సీనియర్లు. తీరా వారు పార్టీకి ఏమైనా అక్కరకు వస్తున్నారా అంటే లేదు అనే జవాబు వస్తోంది.

కేవలం 23 సీట్లకు టీడీపీ పడిపోయి పాతాళానికి ప్రతిష్ట పోయిన స్థాయి నుంచి పార్టీని పట్టాలెక్కించడానికి చంద్రబాబు గడచిన నాలుగున్నరేళ్లలో నానా అవస్థలు పడ్డారు. ఆయన ఇపుడు స్కిల్ స్కాం లో అరెస్ట్ అయి జలు గోడల మధ్యన ఉన్నారు.

చంద్రబాబు ఉన్నపుడు అంతా వన్ మ్యాన్ షోగా సాగింది అనుకున్నా ఆయన ఉంటే చాలు అని సరిపెట్టుకున్నా ఇపుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ కీలక దశలో అయినా సీనియర్లు తలో చేయి వేసి పార్టీని ముందుకు నడిపిస్తారు అనుకుంటే ఒక్కొక్కరూ ఒక్కోలా వ్యవహరిస్తున్నారు అని కామెంట్స్ వస్తున్నాయి.

మాజీ మంత్రి ఆరున్నర పదుల వయసు దాటిన బండారు సత్యనారాయణమూర్తి మహిళా మంత్రిని దారుణంగా విమర్శించి అరెస్ట్ అయిపోయారు. మరో సీనియర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గురించి చెప్పాల్సింది లేదు. ఆయన నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతారు.

ఆయన చేస్తున్న ప్రకటనలు పార్టీని నాలుగడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయని అంటున్నారు. టీడీపీలో వారసత్వపు పోరుకు తెర లేపే విధంగా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి. నారా బ్రాహ్మణి పార్టీకి పెద్ద దిక్కు అన్నట్లుగా అయ్యన్న మాట్లాడేస్తున్నారు.

నారా లోకేష్ అప్పుడే అరెస్ట్ అయిపోయినట్లుగా అర్ధం వచ్చేలా ఆయన ముందస్తు ప్రకటనలు ఉన్నాయని అంటున్నారు. మాకు బ్రాహ్మణి ఉంది అంటే లోకేష్ ఏమీ కానట్లేనా  అన్న మాటలూ ఆ వెనకనే వినిపిస్తున్నాయిట. 

మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  కూడా మీడియా ముందు మాటలు తప్ప గట్టిగా క్షేత్ర స్థాయిలోకి దిగలేకపోతున్నారు అని అంటున్నారు. బండారు అసలే కంపుగా మాట్లాడి ఇంతవరకూ తెచ్చుకున్నారు అనుకుంటే ఆయనకు సాక్ష్యం నేను అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటున్నారు. 

బండారు ఏమి తప్పు మాట్లాడారు అని వత్తాసు పలుకుతూ పార్టీని మరింత పలుచన చేస్తున్నారు. సందట్లో సడెమియా అన్నట్లుగా టీడీపీకి 160 సీట్లు తగ్గవని అచ్చెన్నాయుడు జోస్యాలు కొసమెరుగుపుగా మారుతున్నాయని అంటున్నారు.