Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇక డప్పులకు సెగ తగిలించండి బాస్!

ఇక డప్పులకు సెగ తగిలించండి బాస్!

ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల. మన డప్పు మరెవ్వడూ కొట్టడు. డప్పు కొట్టాలంటే ముందు దానిని సిద్ధం చేసుకోవాలి కదా.. తోలు డప్పుకు కొంచెం సెగ తగిలించాలి. అప్పుడే బాగా మోత మోగుతుంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులంతా తమ తమ డప్పులకు సెగ తగిలించే పనిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డప్పుల మోత మోగించేయాలని పార్టీ అధిష్ఠానం శ్రేణులందరికీ పురమాయిస్తోంది. ఇంతకూ ఏం సాధించారని డప్పు కొట్టుకోవడం? ఇలాంటి సందేహం మామూలు సామాన్యులకు కలుగుతుంది గానీ.. వాళ్లకు కలగదు.

తెలుగుదేశం పార్టీ కేవలం కొన్ని ఆకర్షణీయ వాగ్దానాలు మాత్రమే చేసింది. ఆడ పుటక పుట్టి, ఓటు హక్కు ఉండే ప్రతి ఒక్కరికీ నెలవారీగా మామూళ్లిస్తాం.. మీ ఓట్లు మాకే వేసి గెలిపించండి.. అని ముందుగానే ప్రలోభ పెడుతోంది. పనిలేకుండా ఉండే కుర్రకారు మనకు బోలెడంత మంది కనిపిస్తారు. కానీ ఏ స్థాయి వరకు చదివిన వాడిని నిరుద్యోగి కింద కన్సిడర్ చేస్తారో క్లారిటీ ఇవ్వకుండా.. అందరికీ తలామూడువేలు వంతున పంచుతాం అంటూ ఊరిస్తోంది. 

అయితే ఇవన్నీ తమ ప్రభుత్వం వస్తే చేస్తాం అని ఉత్తుత్తికే ఊరిస్తున్న విషయాలు మాత్రమే. మబ్బుల్లో నీళ్లు చూసి నీళ్లు ఒలకబోసుకోమన్న సామెత చందంగా.. తాము చేయబోయే పనుల గురించి ముందుగా ఇప్పుడే రాష్ట్రమంతా ఇంటింటికీ తిరిగి డప్పు కొట్టాలని పార్టీ కార్యకర్తలను పురమాయిస్తున్నది తెలుగుదేశం.

బేసిగ్గా, చంద్రబాబునాయుడుకు, ఆయన మాటలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఎలాంటి మడత పేచీలు లేకుండా, ఆయన చెప్పింది చేస్తారనే నమ్మకం లేదు. గతంలో రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి, రైతన్నల ఓట్లను దండుకుని, గెలిచిన తర్వాత మాఫీని పలువిడతల కిందకు మార్చి.. చివరికి మాఫీ పూర్తి చేయకుండానే అధికారం దిగిపోయిన నాయకుడు చంద్రబాబు. రైతులకు కొత్త అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఇప్పుడిక కొత్త హామీలతో ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు.

ప్రతి మహిళకు, ప్రతి నిరుద్యోగికి సొమ్ములు ఇచ్చేలోగా.. గెలిచిన తర్వాత.. అందులో ఎన్నెన్ని ట్విస్టులు ఫిటింగులు ఉంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. చంద్రబాబునాయుడు చెప్పిన మహాశక్తి, యువగళం, అన్నదాత లాంటి పథకాలు ఆకర్షణీయంగానే ఉన్నాయి. కానీ.. వాటికి ఆయన మదిలో మాత్రమే ఉన్న నియమనిబంధనలు ఎలాంటివి? అనేదే అందరి సందేహం. 

లబ్ధిదారుల అర్హతల విషయంలో చంద్రబాబునాయుడు క్లారిటీతో చెబితే తప్ప ఆయన దళాలన్నీ ఎంతగా డప్పు కొట్టినాసరే ఆయన మాటల్ని ఎవ్వరూ నమ్మరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?