
మరో సారి చంద్రబాబు తన రాజకీయ చతురత చూపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వెలువడింది. టీడీపీ తరుపున బరిలో దిగిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించారు. వైసీపీ నుండి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఒక్కో ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ లెక్కన వైసీపీకి ఏడుగురు ఎమ్మెల్సీలను దక్కించుకునే బలం ఉంది. అయితే వైసీపీ ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలను కలుపుకున్నా టీడీపీకి ఇంకా ఒకరి మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో వైసీపీలో అంసతృప్తులతో టీడీపీ విజయం సాధించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మూడు పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ ఓడిపోయి షాక్‌లో వుంది. ఇవాళ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య ఫలితంతో వైసీపీ ఆందోళన చెందుతోంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా