
తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం వేదికగా శని, ఆదివారాల్లో మహానాడు నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా తెలుగు మహిళా నాయకురాళ్లు తొడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు తదితరాలు ఉంటాయా? అనే చర్చకు తెరలేచింది. ఎందుకంటే గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడులో మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకురాలు ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మ ప్రత్యేక ప్రదర్శన చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
నాడు మహానాడు సభలో కావలి గ్రీష్మ తొడ కొట్టి... నా కొడకల్లారా అంటూ బూతులు మాట్లాడి సభికుల్ని నివ్వెరపరిచారు. నాడు ఆమె ఏం మాట్లాడారో మరో సారి గుర్తు చేసుకుందాం.
"ఎవడైనా సరే, జగన్‌మోహన్‌రెడ్డి అని ఇంటికొచ్చినా, బస్సు యాత్ర అని వచ్చినా, బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాం సార్. నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూశరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నక పోతే (తొడ కొట్టి) తెలుగుదేశం గడ్డమీద పుట్టినోళ్లం కాదు" అని ఆవేశంతో రెచ్చిపోయారామె.
అప్పట్లో జగన్ రెండో కేబినెట్ ఏర్పడింది. అత్యధికంగా బీసీలు, ఇతర అణగారిన వర్గాలకు జగన్ పెద్దపీట వేశారు. ఈ విషయాన్ని జనానికి చెప్పేందుకు మంత్రులంతా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. దీన్ని జీర్ణించుకోలేక గ్రీష్మ అవాకులు చెవాకులు పేలారు. ఆ తర్వాత కాలంలో ఆమె ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి.
రాజాంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కావలి గ్రీష్మ తహతహలాడేవారు. అయితే అక్కడ మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీకి బలమైన అభ్యర్థి. ఈ మధ్య ఒకసారి గ్రీష్మ ప్లెక్సీలను కొండ్రు అనుచరులు చించిపారేశారు. నోరు పారేసుకోవడం తప్ప, జనంలో పరపతిలేదని గ్రీష్మ గురించి టీడీపీ అధిష్టానం పసిగట్టింది. దీంతో ఆమెను క్రమంగా దూరం పెడుతూ వచ్చింది. ఈ మధ్య గ్రీష్మ టీవీ డిబేట్లలో కూడా కనిపించడం లేదు.
గత ఏడాది మహానాడులో గ్రీష్మ ప్రదర్శను స్ఫూర్తిగా తీసుకుని వంగలపూడి అనిత ఏదైనా అద్భుతం చేస్తే చేయాలని టీడీపీ నాయకులు సెటైర్స్ విసురుతున్నారు. పాయకరావుపేట టికెట్ కోసం అనిత విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. చంద్రబాబు మెప్పుకోసం అనిత లాంటి వారు మహానాడు వేదికగా దూకుడు ప్రదర్శించే అవకాశాలున్నాయని టీడీపీ శ్రేణుల మధ్య చర్చ నడుస్తోంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా