Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబాయ్ కి అసలైన పరీక్ష

బాబాయ్ కి అసలైన పరీక్ష

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్, విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ అయిన వైవీ సుబ్బారెడ్డి తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఆయన రీజనల్ కో ఆర్డినేటర్ గా పదవిని చేపట్టిన తరువాత జరిగిన ఎన్నిక ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఈ ఎన్నిక కోసం హోరాహోరీగా పోరు సాగింది.

అన్ని పార్టీలూ ఈ ఎన్నికల్లో గెలవాలని చూశాయి. అధికార వైసీపీ అయితే ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందే తమ అభ్యర్ధిని ప్రకటించిన వైసీపీకి ఉత్తరాంధ్రాలో అడుగడుగునా అధికార బలం ఉంది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకూ ఆ పార్టీ వారే ఉన్నారు.

మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి అయితే నెల రోజుల పాటు విశాఖలోనే మకాం వేశారు. ఇల్లిల్లూ తిరిగారు. జనాలను  కలిశారు. మొక్కులు మొక్కారు. పూజలూ చేశారు. నాయకులను కో ఆర్డినేట్ చేసుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం అహరహం శ్రమించారు.

ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యమని, తాము ఈ సీటుని జగన్ కి గిఫ్ట్ గా ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికలో వైసీపీని విజయం వరిస్తే వైవీ నూరు మార్కులు సాధించినట్లే అని అంటున్నారు 2024 ఎన్నికల్లో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల మీద వైసీపీ పూర్తి నమ్మకం పెట్టుకుంది 2019లో మాదిరిగా అద్భుత విజయం పార్టీకి దక్కాలని పట్టుదలగా ఉంది.

సెమీ ఫైనల్స్ గా పట్టభద్రుల ఎన్నికలకు విపక్షాలు భావిస్తున్నాయి. మాకు ప్రతీ ఎన్నికా చాలా ముఖ్యమని వైసీపీ మంత్రులు తెలియచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైన వేళ వైవీ సుబ్బారెడ్డి కార్యదీక్షకు ఆయన వ్యూహాలకు కూడా ఈ ఎన్నిక ఒక లిట్మస్ టెస్ట్ గా మారబోతోందని అంటున్నారు. రిజల్ట్ మీద వైసీపీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. బ్యాలెట్ బాక్సులు ఏమి చెబుతాయో అన్న ఉత్కంఠ అయితే ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?