
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జైలుకెళ్లడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. టీడీపీకి చంద్రబాబే బలమని ఈ ఎపిసోడ్‌తో తేలిపోయింది. చంద్రబాబు జీవించినంత కాలమే టీడీపీకి భవిష్యత్ అనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు బెయిల్‌పై ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరగనుంది. దీనిపై ఉత్కంఠ నెలకుంది.
ఇదిలా వుండగా చంద్రబాబుతో ములాఖత్ అయిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడి గురించి గొప్పలు చెప్పడంపై ప్రత్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. యనమలను ఓ రేంజ్‌లో ఆయన ఆడుకున్నారు.
"చంద్రబాబు గారు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామకృష్ణా!"
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలే చంద్రబాబు పిరికి నాయకుడనే పేరు వుంది. అధికారం వుంటేనే ఆయన బలమైన నాయకుడిగా కనిపిస్తారు. లేదంటే భయాందోళనలో వుంటారు. అలాంటి చంద్రబాబునాయుడు జైల్లో వుంటూ విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని యనమల జబర్దస్త్ కామెడీ చేయడాన్ని విజయసాయిరెడ్డి వెటకరించారు. బెయిల్ బాబు బెంబేలెత్తుతుంటే మధ్యలో నీ బిల్డప్ ఏంటంటూ యనమలను విజయసాయిరెడ్డి చురకలు అంటించడం గమనార్హం.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా