
వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. అనం రామనారాయణ రెడ్డి(వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ)ని సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశామన్నారు.
సజ్జల మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తేలాకే సస్పెండ్ చేశామని.. దీనిపై పార్టీలో అంతర్గత దర్యాప్తు చేశామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు చంద్రబాబు రూ.15 కోట్ల నుంచి రూ. 20కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని.. డబ్బులు కూడా చేతులు మారినట్లు విశ్వసిస్తున్నామన్నారు.
కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందేందుకు అవసరమైన మెజారిటీ లేకున్నా 23 ఓట్లతో విజయం సాధించారు. దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలిపోయిన విషయం విదితమే. తనపై తీసుకున్న చర్య సమంజసం అయినప్పటికి.. తీసుకున్న విధానం సరికాదన్నారు. షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరాల్సిందన్నారు కోటంరెడ్డి.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా