Advertisement

Advertisement


Home > Politics - Andhra

విశాఖ ఎంపీ సీటు బీజేపీ త్యాగం వెనక?

విశాఖ ఎంపీ సీటు బీజేపీ త్యాగం వెనక?

విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని గత మూడేళ్ళుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు చెక్ పడిపోయింది. విశాఖ సీటు కోసం ఆయన బీజేపీ హై కమాండ్ వద్ద చేయాల్సిన ప్రయత్నాలు చేశారు.

కానీ విశాఖ సీటు పొత్తులో టీడీపీకి వెళ్లిపోయింది. దీని వెనక ఏపీ బీజేపీ పెద్దల రాజకీయం ఉందని ప్రచారం సాగుతోంది. శ్రీ భరత్ కోసమే విశాఖ ఎంపీ సీటు విషయంలో బీజేపీ కీలక నేతలు పార్టీ ముఖ్య నేతల వద్ద పెద్దగా వత్తిడి చేయలేదని అంటున్నారు.

వాస్తవానికి పురంధేశ్వరి విశాఖ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ విశాఖ ఎంపీ సీటు పొత్తులో తీసుకుంటే అది జీవీఎల్ కే ఇవ్వాలని జాతీయ నాయకత్వం భావించింది అని అంటున్నారు.

దాంతో ఆమె రాజమండ్రికి షిఫ్ట్ అయ్యారు. ఆ మీదట విశాఖ సీటుని పొత్తులో టీడీపీకి వదిలేసేలా ఏపీ బీజేపీ పెద్దలు పావులు కదిపారు అని అంటున్నారు. అనకాపల్లి లో బీజేపీకి ఏమీ లేదు, పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో ఉన్న ఎంపీ సీటు అది. అక్కడ బీజేపీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చిన్న పోస్ట్ గెలవలేదు.

విశాఖలోనే ఆ పార్టీకి పట్టు ఉంది. అలాంటి చోట 2014లో గెలిచిన సీటుని బీజేపీ వదిలేసుకుని గెలవని చోటకు వెళ్తోంది అంటే దీని వెనక రాజకీయమే ఉందని అంటున్నారు. విశాఖ సీటుని జీవీఎల్ కి దక్కకుండా చేయడంలో రెండు పార్టీలలో తెర వెనక శక్తులు పనిచేశాయని ఆయన వర్గం అనుమానిస్తోంది.

జీవీఎల్ కి కేంద్ర బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం ఉన్నా లోకల్ పాలిటిక్స్ కి ఆయన బలి అయ్యారని అంటున్నారు. విశాఖ ఎంపీ సీటుని టీడీపీ తీసుకోవడం పట్ల బీజేపీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. విశాఖ ఎంపీ సీటు తమకు సెంటిమెంట్ అని చెప్పి కేంద్ర నాయకత్వానికి ఆ పార్టీ నాయకులు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది అని అంటున్నారు. ఇపుడు అనకాపల్లి సీటు కూడా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి కాకుండా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వేరే జిల్లాల నుంచి వచ్చిన సీఎం రమేష్ కి కట్టబెట్టాలని చూస్తున్నారు అంటున్నారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?