విశాఖ రాజధాని… కేంద్రమే గుర్తించింది అంటూ….!

విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ఎప్పుడో చెప్పిందని ఆ పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విశాఖ ఏపీలో ఉన్న అతి పెద్ద నగరం,…

విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ఎప్పుడో చెప్పిందని ఆ పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. విశాఖ ఏపీలో ఉన్న అతి పెద్ద నగరం, కేంద్రం తాజాగా గ్రోత్ హబ్ సెంటర్ గా మొత్తం సౌతిండియాలో విశాఖను గుర్తించింది అని ఆయన అంటున్నారు.

విశాఖలో పాలనకు సంబంధించి కార్యాలయాలు సిద్ధం అయ్యాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లుగా దసరా నుంచి విశాఖలో పాలన మొదలవుతుంది అన్నారు చంద్రబాబు హయాంలో అయిదేళ్ళూ ఏపీకి రాజధాని అంటూ లేకుండా చేశారని ఆయన విమర్శించారు.

ఉమ్మడి ఏపీకి పదేళ్ళ పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటే దాన్ని కాకుండా చేశారని ఫైర్ అయ్యారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు.

విశాఖలో దసరా నుంచి పాలన అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ సమావేశంలో ప్రకటించడంతో విశాఖలో పార్టీ శ్రేణులు ఆనందంతో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నయి. దేవుడికి టెంకాయలు కొట్టి మరీ మొక్కులు తీర్చుకున్నారు వైసీపీ నేతలు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ నుంచి జగన్ పాలన ప్రకటన  నేపథ్యంలో వైసీపీలో కొత్తో జోష్ కనిపిస్తోంది.